MLA Pocharam Srinivas reddy | రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. రాజకీయం వదులుకుంటా : ఎమ్మెల్యే పోచారం
MLA Pocharam Srinivas reddy | నాకు ఒక్క పైసా.. ఒక్క పర్సెంట్ కూడా స్వార్థం లేదు.. స్వార్థమనేదే ఉంటే రాజకీయం వదులుకుంటానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి( MLA Pocharam Srinivas reddy )సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Pocharam Srinivas reddy | త్రినేత్ర.న్యూస్ : నాకు ఒక్క పైసా.. ఒక్క పర్సెంట్ కూడా స్వార్థం లేదు.. స్వార్థమనేదే ఉంటే రాజకీయం వదులుకుంటానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి( MLA Pocharam Srinivas reddy )సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం తనకు చేతకాదని వ్యాఖ్యానించారు. మంచిపనులు చేసినవారిని మర్చిపోకపోవడమే మానవత్వం అని ఆయన పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా వర్ని మండలంలో పర్యటించి, జాకోరా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. అందులో రహస్యమేం లేదు.. నా ప్రజల కోసం నా జీవితం.. ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన. కార్యకర్త బాధలను తీర్చాలనేదే నా ఆలోచన. దానికి అనుగుణంగా పని చేస్తున్నాను. తప్పితే నాకు ఒక్క పైసా కూడా, ఒక పర్సెంట్ కూడా స్వార్థం లేదు. స్వార్థమనేదే ఉంటే రాజకీయం వదులుకుంటా నేను. కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని చేయను. పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉట్టిగనే కలిసిండా.. ఆయనకు స్వార్థం ఉంది.. ఒక్కటి చెప్పు నాకు స్వార్థం ఏం ఉందో.. నాకేమన్న డబ్బులిచ్చారా..? నేను ఏమన్న అమ్ముడు పోయానా..? అదే విషయం తెలియడానికి మాట్లాడినా.. వాస్తవం చెప్పాలంటే ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చిర్రు. చెప్పాల్సి వస్తది.. అన్నంపెట్టినోడిని మరుస్తమా..? ఈ ఫంక్షన్ హాల్ కేసీఆర్ వల్ల వచ్చింది.. చెప్పొద్దా..? నా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. కేసీఆర్ చేసిండు కాబట్టే చేసిండు అని చెప్పాను. రేవంత్ రెడ్డి ఇచ్చినవి కూడా చెబుతాను. ఉన్నది ఉన్నట్లు చెప్పడం నా నైజం. పోరాటం చేస్తా తప్ప, తల వంచే రాజకీయం చేయను. నా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తాను. ఎమ్మెల్యేకు ప్రభుత్వ సహకారం కావాలి. ప్రభుత్వ సహకారం లేకుంటే ఏమి చేయలేం అని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Krithi Shetty | కృతిశెట్టి కోసం చెఫ్‌గా మారిన కీర్తి సురేష్ - ఫొటోలు వైరల్
- ●Paytm | ఇన్వెస్టర్లకు అలర్ట్.. పేటీఎంకు సెబీ నోటీసులు..
- ●Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
- ●Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్
- ●MP Mallu Ravi | వందేమాతరం పాడి వెళ్లిపోయారు.. ప్రధాని, అమిత్ షాపై మల్లు రవి ఆగ్రహం
- ●Google Pixel 11 Pro Fold | గూగుల్ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ధర..

Krithi Shetty | కృతిశెట్టి కోసం చెఫ్‌గా మారిన కీర్తి సురేష్ - ఫొటోలు వైరల్

Paytm | ఇన్వెస్టర్లకు అలర్ట్.. పేటీఎంకు సెబీ నోటీసులు..

Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి

Chiranjeevi | కదిరి కాకాజీగా చిరంజీవి - మెగాస్టార్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్






