త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shashi Tharoor | పార్టీ లైన్‌ దాటలేదు.. క్షమాపణలు చెప్పేది లేదు : శశిథరూర్‌

Shashi Tharoor | తాను పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ నియమావళిని ఎప్పుడూ ఉల్లంఘించలేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పష్టం చేశారు. కేరళ సాహిత్యోత్సవంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

P

National | Published On Jan 24, 2026, 3.54 pm IST

Shashi Tharoor | పార్టీ లైన్‌ దాటలేదు.. క్షమాపణలు చెప్పేది లేదు : శశిథరూర్‌
Advertisement

Shashi Tharoor | తాను పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ నియమావళిని ఎప్పుడూ ఉల్లంఘించలేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పష్టం చేశారు. కేరళ సాహిత్యోత్సవంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పార్టీని తాను బహిరంగంగా విభేదించింది ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిందేనని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయంలో అభిప్రాయబేధాలున్నాయని, తాను ఆ విషయంలో కఠిన వైఖరిని తీసుకున్నానన్నారు. ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని, తాను దానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకున్నాన్నారు. ఈ విషయంలో క్షమాపణలు చెప్పబోనన్నారు.

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత తాను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన కాలమ్‌ను ఆయన ప్రస్తావించారు. దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలు టార్గెట్‌గా చేసుకొని భారత్‌ పరిమిత సైనిక చర్యలు తీసుకోవాలని తాను సూచించానని గుర్తు చేశారు. భారత్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న దేశమని, పాక్‌తో సుదీర్ఘ యుద్ధానికి దిగకుండానే ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని తాను భావించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాను సూచించిన తరహాలో చర్యలు చేపట్టిందన్న ఆయన.. ఈ విషయంలో తన వైఖరి సరైందేనని స్పష్టం చేశారు.

ఢిల్లీలో ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలకు శశిథరూర్‌ దూరమైన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వనందుకు ఆయన అసంతృప్తిగా ఉన్నారని, రాష్ట్ర నాయకులు పదేపదే ఆయనను పక్కన పెట్టడానికి ప్రయత్నించినట్లుగా ఊహాగానాలున్నాయి. పార్టీ నాయకత్వంతో ఆయనకు విభేదాలు ఉన్నాయనే వార్తలపై ఆయన స్పందించారు. సమావేశానికి హాజరుకావడం లేదని తాను ముందస్తుగానే సమాచారం ఇచ్చానన్నారు. ఏవైనా అంతర్గత సమస్యలుంటే పార్టీ వేదికలపైనే చర్చిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement