Jairam Ramesh | నోటాకు ప్రధాని కొత్త అర్థం చెప్పారు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
Jairam Ramesh | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత 0.4 శాతం ఎండీఆర్ (MDR) వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు. డెబిట్ కార్డుల ఎండీఆర్ కూడా ఇదే స్థాయిలో ఉండటంతో అమెరికా కార్డు కంపెనీలు (US card companies) యూపీఐతో పోటీ పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా..? అని నిలదీశారు.
Jairam Ramesh | త్రినేత్ర.న్యూస్ : అగ్రరాజ్యం అమెరికా పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, విదేశాంగ విధానాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సాధారణంగా ఎన్నికల్లో ఉపయోగించే 'నోటా' (None of the Above) పదానికి ప్రధాని కొత్త నిర్వచనం చెప్పారని వ్యాఖ్యానించారు. నోటా అంటే 'నరేంద్ర ఆన్‌గోయింగ్ ట్రంప్ అప్పీజ్మెంట్' (Narendras Ongoing Trump Appeasement) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపులపై జీరో-ఎండీఆర్ (zero-MDR) విధానాన్ని ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోందని, ఇది అమెరికా ఒత్తిడికి తలవంచడమేనని ఆయన ఆరోపించారు. అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్, వీసా వంటి పెద్ద ఆర్థిక సంస్థలకు ప్రయోజనం చేకూర్చడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటోందని విమర్శించారు. భారతీయ ఎగుమతులపై అమెరికా భారీ వాణిజ్య సుంకాలు విధిస్తోందని, అదే సమయంలో భారతీయ టెక్ నిపుణులపై వీసా నిబంధనలను కఠినతరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
"రేపు అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) భారతదేశంపై 100 శాతం టారిఫ్‌లు విధించే బిల్లుపై ఓటింగ్ నిర్వహించనుంది. ఈ కఠినమైన చట్టానికి ఇప్పటికే అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ట్రంప్ యంత్రాంగం భారతీయ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చట్టాలు తెస్తోంది. హెచ్-1బీ (H-1B) వీసా ఖర్చులు పెంచారు. ఉద్యోగం కోల్పోయిన వీసాదారులు తక్షణమే దేశం వీడాల్సిన పరిస్థితి. వీరిలో ఎక్కువమంది ఐటీ నిపుణులే ఉన్నారు" అని జైరామ్ రమేష్ తెలిపారు.
వాషింగ్టన్ దూకుడు చర్యలను తిప్పికొట్టాల్సిన కేంద్ర సర్కార్.. వీసా (Visa), మాస్టర్ కార్డ్ (Mastercard)లకు లాభం చేకూర్చేలా ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి యూపీఐ లావాదేవీలపై జీరో మెర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని తొలగించిందని విమర్శించారు. యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత 0.4 శాతం ఎండీఆర్ (MDR) వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు. డెబిట్ కార్డుల ఎండీఆర్ కూడా ఇదే స్థాయిలో ఉండటంతో అమెరికా కార్డు కంపెనీలు (US card companies) యూపీఐతో పోటీ పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా..? అని నిలదీశారు. అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను ఆర్థికంగా మరింత స్థిరంగా మార్చేందుకు లావాదేవీల ఛార్జీలు అవసరమన్న ప్రభుత్వ వాదనను జైరామ్ రమేష్ తోసిపుచ్చారు. కేంద్ర బ్యాంకు ఏటా బదిలీ చేసే వేల కోట్ల రూపాయల మిగులు నిధులతో పోలిస్తే దేశంలో ఉచిత డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను (Digital Payments Infrastructure) నిర్వహించడానికి అయ్యే ఖర్చులు చాలా తక్కువని వాదించారు.
Also Read..
పీజీ చదువుతూనే వైద్యురాలిగా ప్రభుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలిపై వేటు
మాళవికకు వరుస ఫ్లాపులు.. ఈ ఏడాది కలిసిరాని భారీ బడ్జెట్ సినిమాలు..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
సెప్టెంబర్ 16, 2026

UPI | రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?
సెప్టెంబర్ 16, 2026

UPI | వినియోగదారులకు పేటీఎం గుడ్‌న్యూస్.. యూపీఐ చార్జిలు విధించబోమని ప్రకటన..
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
- ●Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●UPI | రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?
- ●Eatala Rajender | దాచేస్తే దాగేది కాదు తెలంగాణ చరిత్ర
- ●Vishwambhara | ‘విశ్వంభర’పై మెగాస్టార్‌దే తుది నిర్ణయం..! రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో..!
- ●Vote For Notes Case Supreme Court | సుప్రీంకోర్టులో 'ఓటుకు కోట్లు' కేసు విచారణ.. గంటన్నరపాటు సాగిన లూత్ర వాదనలు

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం

Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

UPI | రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?

Eatala Rajender | దాచేస్తే దాగేది కాదు తెలంగాణ చరిత్ర



