త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vishwambhara | ‘విశ్వంభర’పై మెగాస్టార్‌దే తుది నిర్ణ‌యం..! రిలీజ్ డేట్ ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో..!

Vishwambhara | మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో వెయిట్‌ చేస్తున్న సినిమా ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్‌ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో సాగుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ మాత్రం ఇంకా ఫిక్స్‌ కాలేదు.

P

Entertainment | Published On Sep 16, 2026, 3.59 pm IST

Vishwambhara | ‘విశ్వంభర’పై మెగాస్టార్‌దే తుది నిర్ణ‌యం..! రిలీజ్ డేట్ ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో..!
Advertisement

Vishwambhara | మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో వెయిట్‌ చేస్తున్న సినిమా ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్‌ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో సాగుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ మాత్రం ఇంకా ఫిక్స్‌ కాలేదు. దీంతో ఎప్పటికప్పుడు కొత్త డేట్‌పై రూమర్స్‌ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ‘విశ్వంభర’కు ఓటీటీ డీల్‌ కూడా లాక్‌ అయిందని, దీంతో సినిమాను సంక్రాంతి 2027 బరిలోకి దింపే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారనే టాక్‌ వినిపించింది. అదే జరిగితే చిరంజీవి నటిస్తున్న మరో చిత్రం ‘కాకా’ రిలీజ్‌ను మరో డేట్‌కు షిఫ్ట్‌ చేసే ఛాన్స్‌ ఉందనే ప్రచారం కూడా జరిగింది.

అయితే, ఈ ప్రచారానికి సంబంధించి ప్రస్తుతం చిత్రబృందం క్లారిటీ లేదు. ‘విశ్వంభర’ రిలీజ్‌ విషయంలో ఫైనల్‌ కాల్‌ చిరంజీవిదేనని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో రిలీజ్‌ డేట్‌పై మెగాస్టార్‌ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీమ్‌కు సన్నిహిత వర్గాల సమాచారం. ఆయన తీసుకునే నిర్ణయాన్నే నిర్మాతలు ఫైనల్‌గా తీసుకోనున్నారట. రిలీజ్‌ డేట్‌ లాక్‌ కాకపోవడంతో సినిమా ప్రమోషన్స్‌ విషయంలోనూ మేకర్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. సాధారణంగా రిలీజ్‌కు కొన్ని నెలల ముందే మ్యూజిక్‌, టీజర్‌, ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌తో బజ్‌ క్రియేట్ చేస్తుంటారు. కానీ, ‘విశ్వంభర’ విషయంలో డేట్‌ కన్ఫర్మ్‌ కాకపోవడంతో ఫుల్‌ ఫ్లెడ్జ్డ్‌ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌ స్టార్ట్‌ కాలేదు. ఇప్పటికే విడుదలైన పాట కూడా కాలక్రమంలో ప్రేక్షకుల మెమరీ నుంచి ఫేడ్‌ అయిపోయింది. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసిన తర్వాత సినిమాపై మళ్లీ స్ట్రాంగ్ బ‌జ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక ‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష, ఆశికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులు వేయనున్నారు. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న‌ది.

వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. విక్రమ్‌ రెడ్డి సమర్పిస్తున్నారు. భారీ స్కేల్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో ఇప్పటికే క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు అందరి చూపూ రిలీజ్‌ డేట్‌పైనే. చిరంజీవి నుంచి వచ్చే ఫైనల్‌ కాల్‌తో ‘విశ్వంభర’ థియేట్రికల్‌ రిలీజ్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement