Abhijeet Dipke | నిరుపయోగంగా ఉన్న పీఎం కేర్స్ నిధులను పాఠశాలల అభివృద్ధికి ఉపయోగించండి : అభిజీత్ దిప్కే
Abhijeet Dipke | పీఎం కేర్స్ నిధిలో రూ. 8,452 కోట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) వ్యాఖ్యానించారు. ఆ నిధులను ప్రభుత్వ పాఠశాలల్లో (rural government schools) కనీస వసతులు కల్పించడానికి ఎందుకు వినియోగించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.
త్రినేత్ర.న్యూస్ : పీఎం కేర్స్ (PM CARES) కార్పస్ నిధులు భారీగా పెరిగినప్పటికీ, వాటిని ఎక్కడా వినియోగించడం లేదని కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించడానికి ఈ నిధులను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు.
మార్చి 31, 2025 నాటికి పీఎం కేర్స్ ఫండ్ (PM CARES Fund) నిల్వలు ఏకంగా రూ. 8,452 కోట్లకు చేరుకున్నట్లు తాజా ఆడిట్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిప్కే స్పందించారు. కేంద్ర సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత కొన్ని రోజులుగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తాను సందర్శిస్తున్నట్లు చెప్పారు. అక్కడ విద్యార్థులు తాగునీరు సహా కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిధుల కొరత వల్లే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారని, కానీ రూ. 8,500 కోట్లు పీఎం కేర్స్ నిధిలో నిరుపయోగంగా పడి ఉన్నాయని విమర్శించారు. ఆ నిధులను పాఠశాలల అభివృద్ధికి ఎందుకు కేటాయించకూడదు అని నిలదీశారు.
ఆ నిధులతో 1,000 ఆదర్శ పాఠశాలలను నిర్మించొచ్చు
ఒక్కో అత్యాధునిక ఆదర్శ పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.8 కోట్లు ఖర్చవుతుందని దిప్కే అంచనా వేశారు. ఈ లెక్కన పీఎం కేర్స్ నిధిలోని మొత్తం రూ. 8,500 కోట్లతో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కొత్త హైటెక్ మోడల్ స్కూళ్లను నిర్మించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా దిప్కే వీడియో విడుదల చేశారు.
పెరిగిన పీఎం కేర్స్ నిధి కార్పస్...
ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (PM CARES) ఫండ్ ఆడిటెడ్ స్టేట్‌మెంట్స్ ప్రకారం.. ఈ నిధి కార్పస్ 2023-24లో రూ. 7,173.03 కోట్ల నుంచి, 2024-25 నాటికి 17.8 శాతం పెరిగి రూ. 8,452.07 కోట్లకు చేరింది. దేశీయ, విదేశీ విరాళాలు తగ్గినప్పటికీ.. మొత్తం బ్యాలెన్స్‌లో 93 శాతం అంటే సుమారు రూ. 7,846 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDs) రూపంలోనే ఉండటం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూపంలోనే రూ. 475 కోట్లు ఆదాయం రాగా, ఖర్చు చేసింది కేవలం రూ.87.85 లక్షలు మాత్రమే.
సీజేపీ 'స్కూల్ ఠీక్ కరో' ఉద్యమం
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాక్రోచ్ పార్టీ తన 'స్కూల్ ఠీక్ కరో' (School Thik Karo) ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని దిప్కే సొంత గ్రామంలో ఈ కార్య్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో భాగంగా దిప్కే స్వయంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను మెరుగుపరచడం, విద్యావ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడం ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా పాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రజలు, సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలని దిప్కే పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే పాఠశాలలను సందర్శించి అక్కడ సౌకర్యాల గురించి సీజేపీకి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read..
2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం
9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్నవారికి షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..
సంబంధిత వార్తలు

Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ
ఆగస్టు 15, 2026

Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుద్దాం : సీజేపీ పిలుపు
ఆగస్టు 11, 2026

Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | 2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం
- ●Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?
- ●Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●Job Mela at Osmania University | ఓయూలో జాబ్ మేళా.. ఫార్మసీ, డిగ్రీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్, రూ.25 వేల జీతం
- ●Gade Innaiah gets bail | తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
- ●Sabitha Indra Reddy | 22A వెనుక ఆ 'మతలబు' ఏంటి? కమీషన్లు ఇస్తేనే క్లియరెన్సా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

Bandi Sanjay | 2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం

Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?

Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..

Job Mela at Osmania University | ఓయూలో జాబ్ మేళా.. ఫార్మసీ, డిగ్రీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్, రూ.25 వేల జీతం



