త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabitha Indra Reddy | 22A వెనుక ఆ ‘మతలబు’ ఏంటి? కమీషన్లు ఇస్తేనే క్లియరెన్సా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

హైదరాబాద్‌లోని 22A భూముల వెనుక భారీ స్కామ్ దాగుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో బాధితుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.

J

Hyderabad | Published On Aug 19, 2026, 3.42 pm IST

Sabitha Indra Reddy | 22A వెనుక ఆ ‘మతలబు’ ఏంటి? కమీషన్లు ఇస్తేనే క్లియరెన్సా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్
Advertisement
  • తెలంగాణ భవన్‌లో 22A భూముల బాధితులతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం
  • కమీషన్లు ఇస్తేనే 22A జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
  • 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు బ్లాక్ లిస్ట్‌లో ఎలా పెడతారని సూటి ప్రశ్న
  • అధికారుల తప్పు అని చేతులు దులుపుకుంటే సరిపోదని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ

Sabitha Indra Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో హాట్ టాపిక్‌గా మారిన '22A' భూముల సమస్యపై ఆమె సర్కార్‌ను నిలదీశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన 22A బాధితుల సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యవహారం వెనుక పెద్ద స్కామ్ (Scam) దాగుందనే అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆ మతలబు బయటకు రావాల్సిందే

హైదరాబాద్‌లోని ప్రతి ఏరియా నుంచి 22A బాధితులు తమకు ఫోన్లు చేసి గోడు వెళ్లబోసుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ 22A లిస్ట్ వెనుక కచ్చితంగా ఏదో మతలబు ఉంది.. ఆ సీక్రెట్ ఏంటో బయటకు రావాల్సిందే" అని డిమాండ్ చేశారు. కమీషన్లు ఇస్తేనే భూములను ఈ జాబితా నుంచి తీసేస్తున్నారని, లేదంటే రైతులు, యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

డేగల్లా వాలిపోతున్నారు..

ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఈ ప్రభుత్వం డేగలా వాలిపోతోందని సబిత విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలో అసైన్డ్ ల్యాండ్స్‌కు సంబంధించి అగ్రిమెంట్లు (Agreements) చేసుకున్నారని ఆరోపించారు. "40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు సడెన్‌గా ఇప్పుడు 22A లిస్ట్‌లో (List) ఎలా పడుతుంది?" అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కేవలం అధికారులు తప్పు చేశారని మంత్రులు చేతులు దులుపుకుంటే సరిపోదని.. అసలు ముఖ్యమంత్రి నోటీసులో లేకుండానే 22A జాబితాలో భూములను పెట్టారా? అని నిలదీశారు.

సీఎం విదేశీ టూర్లకే పరిమితం

రెండు రోజుల్లో సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు 20 రోజుల పాటు విదేశీ పర్యటనలకు (Foreign tour) వెళ్లారని ఎద్దేవా చేశారు. అసలు ఈ ప్రభుత్వం ఎవరికి జవాబుదారీగా ఉందో అర్థం కావడం లేదన్నారు. 22A బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వారికి పూర్తి సపోర్ట్ (Support) ఇస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. బాధితుల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement