SIM Card Rules | 9 కంటే ఎక్కువ సిమ్‌లు ఉన్నవారికి షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..
SIM Card Rules | సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇకపై ఒక వ్యక్తి పేరుతో 9కి మించి సిమ్ కార్డులు జారీ చేయడం సాధ్యం కాదు. జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ పరిమితిని 6 సిమ్ కార్డులుగా నిర్ణయించారు.
Technology | Published On Aug 19, 2026, 4.12 pm IST
SIM Card Rules | సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇకపై ఒక వ్యక్తి పేరుతో 9కి మించి సిమ్ కార్డులు జారీ చేయడం సాధ్యం కాదు. జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ పరిమితిని 6 సిమ్ కార్డులుగా నిర్ణయించారు. ఇప్పటికే 9 మొబైల్ కనెక్షన్ల పరిమితికి చేరుకున్న వినియోగదారుల ఫొటోలను ఈ వారం నుంచే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. డిజిటల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ద్వారా ఒక వ్యక్తి పేరుతో కొనసాగుతున్న మొబైల్ కనెక్షన్లను గుర్తించనున్నారు. 9కి చేరుకున్న లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్న వినియోగదారుల ఫొటోలు ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు, లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియాలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారులకు అందుబాటులో ఉంటుంది.
సైబర్ నేరాలను తగ్గించడమే లక్ష్యం..
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఫొటోల ఆధారంగా టెలికాం కంపెనీలు సంబంధిత వినియోగదారులను గుర్తించనున్నాయి. ఇప్పటికే నిర్ణయించిన పరిమితి మేరకు సిమ్ కార్డులు ఉన్న వ్యక్తులు మరో కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోకుండా అడ్డుకోనున్నారు. దీంతో ఒకే వ్యక్తి పేరుతో పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ కొత్త విధానాన్ని ఈ ఏడాది నవంబర్ 30లోగా రియల్ టైమ్ సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా భాగం చేయాలని టెలికాం సంస్థలకు సూచించారు. అంటే కొత్త సిమ్ కార్డును యాక్టివేట్ చేసే సమయంలోనే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ నుంచి లభించే సమాచారాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.
సిమ్ కార్డుల దుర్వినియోగం ద్వారా జరిగే సైబర్ మోసాలను అరికట్టడంతోపాటు, ఒక వ్యక్తి పేరుతో ఉన్న మొబైల్ కనెక్షన్లను సమర్థవంతంగా గుర్తించడం, పర్యవేక్షించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశంగా ఉంది.
తాజావార్తలు
- ●Bandi Sanjay | 2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం
- ●Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?
- ●Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
- ●Job Mela at Osmania University | ఓయూలో జాబ్ మేళా.. ఫార్మసీ, డిగ్రీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్, రూ.25 వేల జీతం
- ●Gade Innaiah gets bail | తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
- ●Sabitha Indra Reddy | 22A వెనుక ఆ 'మతలబు' ఏంటి? కమీషన్లు ఇస్తేనే క్లియరెన్సా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

Bandi Sanjay | 2028లో తెలంగాణలో బీజేపీదే పవర్.. వెంటనే జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇస్తాం

Priya Bhavani Shankar | ‘ఇరుముడి’తో ప్రియా భవానీ శంకర్‌కు తెలుగులో బ్రేక్ వచ్చేనా?

Stock Markets | వరుసగా ఏడో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..

Job Mela at Osmania University | ఓయూలో జాబ్ మేళా.. ఫార్మసీ, డిగ్రీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్, రూ.25 వేల జీతం






