Boeing 737 Max | బోయింగ్ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్‌వేర్ లోపం
Boeing 737 Max | బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సాఫ్ట్‌వేర్ లోపం వెలుగుచూసింది. ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించే సమయంలో ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ సిస్టమ్ షట్‌డౌన్ అయ్యే అవకాశం ఉన్నట్లు బోయింగ్ గుర్తించింది.
International | Published On Sep 27, 2026, 9.35 pm IST
- ల్యాండింగ్ విఫలమైతే ఆటోమేటెడ్ సిస్టమ్ షట్‌డౌన్ అయ్యే అవకాశం
- భారత్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాసా వద్ద 96 విమానాలు
- సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై బోయింగ్ కసరత్తు
Boeing 737 Max | బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సాఫ్ట్‌వేర్ లోపం వెలుగుచూసింది. ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైన తర్వాత మరోసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించే సమయంలో ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ సిస్టమ్ షట్‌డౌన్ అయ్యే అవకాశం ఉన్నట్లు బోయింగ్ గుర్తించింది. ముందుగా నిర్దేశించిన ల్యాండింగ్ మార్గానికి భిన్నమైన ఫ్లైట్ పాత్‌ను విమానం ఫాలో అయిన సందర్భంలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
గత నెలలోనే ఎయిర్‌లైన్స్‌కు సమాచారం
ఈ సమస్యపై 737 విమానాలను నడుపుతున్న అన్ని ఎయిర్‌లైన్స్‌కు గత నెలలోనే సమాచారం ఇచ్చినట్లు బోయింగ్ ప్రతినిధి తెలిపారు. ఇలాంటి పరిస్థితులను పైలట్లు సురక్షితంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఉన్న విధానాలను మరోసారి వివరించినట్లు పేర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను బోయింగ్ రూపొందిస్తోంది. అప్పటివరకు ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ విఫలమైన ప్రతిసారి సిస్టమ్‌ను రీసెట్ చేయాలని ఆపరేటర్లకు సూచించింది.
భారత్‌లో 96 మ్యాక్స్ విమానాలు
ఈ వ్యవహారం భారత్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాసా ఎయిర్ విమానాల సముదాయంలో కలిపి సుమారు 96 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ఇందులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వద్ద సుమారు 53, ఆకాసా ఎయిర్ వద్ద 43 ఉన్నాయి. బోయింగ్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆకాసా ఎయిర్ తెలిపింది. ఈ సమస్య తమ విమానాల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని పేర్కొంది. నిర్దేశిత విధానాలు, నిబంధనలకు అనుగుణంగానే విమానాలను సురక్షితంగా నడుపుతున్నట్లు వెల్లడించింది. తమ 737 మ్యాక్స్ విమానాల్లో ఎన్ని ఈ సమస్య పరిధిలో ఉన్నాయన్నది స్పష్టం చేయలేదు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందించలేదు.
డీజీసీఏ ఏం చేస్తుంది?
ఈ అంశంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. సమస్యపై దర్యాప్తు చేస్తుందా? ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యేక సూచనలు జారీ చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎయిర్‌లైన్స్‌కు బోయింగ్ 2,400కుపైగా 737 మ్యాక్స్ విమానాలను అందించింది. దీంతో ఈ సాఫ్ట్‌వేర్ లోపంపై విమానయాన సంస్థలు, నియంత్రణ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఎయిర్‌బస్ ఏ321 నియోలోనూ..
ఇదిలా ఉండగా.. మరో విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ కూడా ఈ వారంలో పెద్ద సంఖ్యలో ఏ321 నియో విమానాలకు సంబంధించిన నాణ్యత సమస్యను గుర్తించింది. విమానం వెలుపలి భాగానికి రక్షణగా ఉండే కోటింగ్‌కు సంబంధించిన ఈ సమస్య భారత్‌లో సుమారు డజను ఇండిగో విమానాలను ప్రభావితమవుతున్నట్లుగా సమాచారం. ఇండిగో, ఎయిర్ ఇండియా వద్ద కలిపి సుమారు 190 ఏ321 నియో విమానాలు ఉన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Festive Season Appliance Price Hike | పండక్కి ఆఫర్లా.. వాతలా? వినియోగదారులకు ఊహించని షాక్.. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలు పైపైకి
- ●Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!
- ●Pink Power Run 3.0 | నెక్లెస్ రోడ్డుపై 35 వేల మందితో పరుగుల పండగ: రొమ్ము క్యాన్సర్‌పై పోరుకు హైదరాబాద్ పింక్ పవర్ రన్ 3.0
- ●Tollywood | ప్రభాస్ బర్త్‌డేకు థియేటర్లలోకి రోమియో జూలియట్
- ●Fake Notes | మార్కెట్లోకి 500 రూపాయల నకిలీ నోట్లొచ్చేశాయ్.. బీ కేర్ ఫుల్
- ●Malayalam OTT | 25 కోట్ల బడ్జెట్ - 325 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి మమితాబైజు మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ

Festive Season Appliance Price Hike | పండక్కి ఆఫర్లా.. వాతలా? వినియోగదారులకు ఊహించని షాక్.. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలు పైపైకి

Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!

Pink Power Run 3.0 | నెక్లెస్ రోడ్డుపై 35 వేల మందితో పరుగుల పండగ: రొమ్ము క్యాన్సర్‌పై పోరుకు హైదరాబాద్ పింక్ పవర్ రన్ 3.0

Tollywood | ప్రభాస్ బర్త్‌డేకు థియేటర్లలోకి రోమియో జూలియట్




