త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకు థియేట‌ర్ల‌లోకి రోమియో జూలియ‌ట్

దీవానా ఫేమ్ హ‌ర్షిత్ రెడ్డి జెన్‌జీ ల‌వ్‌స్టోరీతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. రోమియో జూలియ‌ట్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా గ్లింప్స్‌ను రెబెల్ స్టార్ ప్ర‌భాస్ ఆదివారం రిలీజ్ చేశారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Sep 27, 2026, 8.59 pm IST

Tollywood |  ప్ర‌భాస్ బ‌ర్త్‌డేకు థియేట‌ర్ల‌లోకి రోమియో జూలియ‌ట్
Advertisement

Tollywood |  ఈ ఏడాది దీవానా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు హర్షిత్ రెడ్డి. తాజాగా అత‌డు మ‌రో యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాకు రోమియో జూలియ‌న్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. విశాఖ ధిమాన్ హీరోయిన్‌. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైవా హర్ష, సిరి హనుమంతు, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్ర‌భాస్ బ‌ర్త్‌డే...

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న ‘రోమియో జూలియట్’ థియేటర్లలోకి రాబోతుంది. ఆదివారం ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమా క‌థేమిట‌న్న‌ది గ్లింప్స్ ద్వారా మేక‌ర్స్ హింట్ ఇచ్చారు.

గ‌న్ డీల‌ర్‌...

గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇందులో హీరో ఒక లోకల్ గన్ డీలర్‌ను కలసి ఆయుధాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఓ అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతో అత‌డు గ‌న్ కొనాల‌ని అనుకుంటాడు. ఆ అమ్మాయిపై అత‌డి ద్వేషానికి కార‌ణ‌మేమిట‌నే అంశాల‌కు మోడ్ర‌న్ రిలేష‌న్స్‌ను జోడించి ఈ గ్లింప్స్ ఆస‌క్తిక‌రంగా సాగింది. జెన్‌జీ త‌రం ప్రేమాయ‌ణాలు, రిలేషన్‌షిప్స్‌, గొడవలు, బ్రేకప్స్‌ను ఎలా చూస్తున్నాయి? సోషల్ మీడియా, పబ్లిక్ బ్రేకప్స్ ప్ర‌భావం వారిపై ఎలా ఉండ‌నుంద‌నే అంశాల‌తో యూత్‌ను టార్గెట్ చేసి ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

గోపీ సుంద‌ర్ మ్యూజిక్‌...

‘రోమియో జూలియట్’కు భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాఘతి కథ అందించారు. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన క‌ల్కి 2898 ఏడీలో హ‌ర్షిత్ రెడ్డి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు.

 

Advertisement
Advertisement