Jordan Vs Algeria | గెలిచి నిలిచిన అల్జీరియా
Jordan Vs Algeria | ప్రపంచకప్‌లో తప్పనిసరిగా గెలువాల్సిన మ్యాచ్‌లో అల్జీరియా అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో వెనుకబడినా రెండోభాగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జోర్డాన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితంతో అల్జీరియా నాకౌట్ దశ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా రెండు ఓటములతో జోర్డాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- నాకౌట్ ఆశలు సజీవం
- జోర్డాన్‌పై 2-1 తేడాతో విజయం
- టోర్నీ నుంచి నిష్క్రమించిన పసికూన
- వరల్డ్ కప్ హిస్టరీలో జోర్డాన్ తొలి గోల్ నమోదు
Jordan Vs Algeria | ప్రపంచకప్‌లో తప్పనిసరిగా గెలువాల్సిన మ్యాచ్‌లో అల్జీరియా అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో వెనుకబడినా రెండోభాగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జోర్డాన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితంతో అల్జీరియా నాకౌట్ దశ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా రెండు ఓటములతో జోర్డాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చరిత్రలో తొలి గోల్ ఇలా..
ప్రపంచకప్‌లో తొలిసారి బరిలోకి రంగంలోకి జోర్డాన్ ఆరంభం నుంచే క్రమశిక్షణ రక్షణాత్మక ధోరణిలో ఆడింది. మ్యాచ్ ప్రారంభమైన తొలి నిమిషంలోనే నిజార్ అల్ రష్దాన్ హెడ్డర్‌తో గోల్ వేసేందుకు ప్రయత్నించాడు. మరోవైపు బంతిపై ఆధిపత్యం చెలాయించిన అల్జీరియా గోల్‌కు చేరువైనప్పటికీ.. చేరువైనప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. అమీన్ గౌయిరి, ఫారెస్ చైబీ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అల్జీరియా ఒత్తిడిని తట్టుకున్న జోర్డాన్ 36వ నిమిషంలో సంచలన ఆధిక్యం సాధించింది. మిడ్‌ఫీల్డ్‌లో అల్జీరియా చేసిన చిన్న పొరపాటును సద్వినియోగం చేసుకొని నిజార్ అల్ రష్దాన్ అద్భుత ఫినిషింగ్ చేస్తూ బంతిని గోల్‌లోకి పంపాడు. ప్రపంచకప్ చరిత్రలో జోర్డాన్ సాధించిన తొలి గోల్ ఇదే కావడం విశేషం. ఆ గోల్‌తో జట్టు అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ఉక్కిరిబిక్కిరి..
విరామం తర్వాత మ్యాచ్ పూర్తిగా అల్జీరియా వైపు మళ్లింది. వరుస దాడులతో జోర్డాన్ డిఫెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. గోల్‌కీపర్ యజీద్ అబులైలా పలుమార్లు అద్భుత సేవ్‌లు చేసినా, 69వ నిమిషంలో మాత్రం జట్టును కాపాడలేకపోయాడు. రియాద్ మహ్రెజ్ ఇచ్చిన కార్నర్‌ను నధీర్ బెన్‌బౌలి చక్కటి హెడ్డర్‌తో గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. ఆ గోల్‌తో అల్జీరియా మరింత దూకుడు పెంచింది. జోర్డాన్ డిఫెన్స్‌పై ఒత్తిడి కొనసాస్తూ.. 82వ నిమిషంలో విక్టరీ గోల్ వేసింది. మరో కార్నర్ నుంచి వచ్చిన బంతి గందరగోళంలో అమీన్ గౌయిరి ముందుగా స్పందించి గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఆ గోల్‌తో స్టేడియంలో ఉన్న అల్జీరియా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయంతో ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో 3-0తో ఓడిన అల్జీరియా తిరిగి రేసులో నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో తొలి గోల్ ఇచ్చిన తర్వాత మ్యాచ్ గెలువడం విశేషం. గతంలో అలాంటి పరిస్థితుల్లో అల్జీరియా ఏడు మ్యాచ్‌లు ఓడిపోగా.. రెండింటిని డ్రా చేసుకుంది.
రెండోస్థానానికి..
పాయింట్ల పట్టికలో అల్జీరియా గ్రూప్-జేలో రెండో స్థానాన్ని చేరుకుంది. నాకౌట్ దశకు చేరాలంటే అల్జీరియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రియాపై విజయం సాధించాల్సి ఉంది. మరోవైపు తొలి ప్రపంచకప్ ఆడుతున్న జోర్డాన్.. వరుసగా ఆస్ట్రియా, అల్జీరియా చేతుల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పోరాట పటిమతో అభిమానుల ప్రశంసలు అందుకుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Vijay | అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్.. వీడియో వైరల్
- ●SpaceX | జోష్ చల్లారిందా? స్పేస్ఎక్స్కు భారీ షాక్.. 600 బిలియన్ డాలర్లు ఆవిరి..
- ●Instagram For TV | టీవీలో ఇన్స్టాగ్రామ్.. కొత్త ఫీచర్లతో సోషల్ వీడియో ఎక్స్‌పీరియెన్స్..
- ●Srinivas Goud | పాలమూరు ఎడారిగా మారుతోంది.. కాంగ్రెస్ కుట్రలను అడ్డుకుంటాం : శ్రీనివాస్ గౌడ్
- ●CM Vijay | నటుడి పార్టీ అన్నారు.. రాజకీయాలు ఇంత క్రూరమా..? : అసెంబ్లీలో విజయ్ కీలక ప్రసంగం
- ●Telegram App | టెలిగ్రామ్ యాప్ సరిగ్గా పనిచేయడం లేదా.. ఈ సూచనలు పాటించండి..

CM Vijay | అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన సీఎం విజయ్.. వీడియో వైరల్

SpaceX | జోష్ చల్లారిందా? స్పేస్ఎక్స్కు భారీ షాక్.. 600 బిలియన్ డాలర్లు ఆవిరి..

Instagram For TV | టీవీలో ఇన్స్టాగ్రామ్.. కొత్త ఫీచర్లతో సోషల్ వీడియో ఎక్స్‌పీరియెన్స్..

Srinivas Goud | పాలమూరు ఎడారిగా మారుతోంది.. కాంగ్రెస్ కుట్రలను అడ్డుకుంటాం : శ్రీనివాస్ గౌడ్






