త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp Policy | అలా అయితే భార‌త్ నుంచి వెళ్లిపోండి.. మెటాకు సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్‌

WhatsApp Policy | దిగ్గజ టెక్ సంస్థ, ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఓన‌ర్‌ మెటాపై (Meta) దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది.

D

National | Published On Feb 3, 2026, 12.57 pm IST

WhatsApp Policy | అలా అయితే భార‌త్ నుంచి వెళ్లిపోండి.. మెటాకు సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్‌
Advertisement

WhatsApp Policy | దిగ్గజ టెక్ సంస్థ, ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఓన‌ర్‌ మెటాపై (Meta) దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది. వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. లేదంటే భార‌త్‌ను విడిచి వెళ్లిపోవాలంటూ సీరియ‌న్ వార్నింగ్ ఇచ్చింది.

వాట్సాప్ 2021 ప్రైవ‌సీ పాల‌సీపై సుప్రీంకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా వాట్సాప్ మాతృసంస్ధ మెటాను సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ (CJI Surya Kant) తీవ్రంగా హెచ్చరించారు. "మా దేశ ప్రజల గోప్యతతో మీరు ఆటలాడలేరు. మా డేటాలో సింగిల్ డిజిట్ కూడా పంచుకునేందుకు మేము అనుమతించము. మా దేశంలో కార్య‌క‌లాపాలు సాగించాలంటే ఇక్క‌డి చ‌ట్టాల‌ను మీరు పాటించి తీరాల్సిందే. లేదంటే మీరు భార‌త్‌ను విడిచిపెట్టి వెళ్లిపోవ‌చ్చు" అని చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ అన్నారు. అంతేకాదు ప్రైవ‌సీ పాల‌సీ విధానంపై సీజేఐ సీరియ‌స్ అయ్యారు. ప్రైవ‌సీ పాల‌సీ నిరక్ష్య‌రాసుల‌కు ఎలా అర్థం అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. కొన్ని సంద‌ర్భాల్లో మీ పాల‌సీలు అర్థం చేసుకోవ‌డం మాకే ఇబ్బందిగా మారుతుంద‌ని వ్యాఖ్యానించారు. అలాంట‌ప్పుడు దేశ ప్ర‌జ‌ల‌కు ప్రైవ‌సీ ఎలా అర్థం అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

వాట్సప్ ప్రైవసీ పాలసీ..

వాట్సప్ ప్రైవసీ పాలసీలో మెటా కీల‌క మార్పులు చేసింది. వాట్సాప్ మెసేజింగ్ సేవలను కొనసాగించాలంటే మెటా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లతో డేటా పంచుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందే. అంతేకాదు వాట్సప్ కొత్త రూల్స్ యాక్సెప్ట్ చేసినట్టైతే మీరు ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కి తెలుస్తాయి.

ఇక వాట్సాప్ 2021 గోప్యతా విధాన (WhatsApp's 2021 privacy policy) నవీకరణను పరిశీలిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నవంబర్ 2024లో జారీ చేసిన ఉత్తర్వుల నుండి ఈ వివాదం తలెత్తింది. వినియోగదారులను కొత్త గోప్యతా విధానాన్ని తప్పనిసరిగా అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి తీసుకువచ్చిందని సీసీఐ పేర్కొంది. వాట్సాప్ మెసేజింగ్ సేవలను కొనసాగించాలంటే మెటా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లతో డేటా పంచుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని వినియోగదారులకు తెలిపిందని సీసీఐ ఆక్షేపించింది. ఈ చర్య పోటీ చట్టానికి విరుద్ధమని భావించి రూ.213 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశించింది. ఈ ఉత్తర్వును మెటా, వాట్సాప్ 2025 జనవరిలో సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. 2025 నవంబర్‌లో న్యాయ ట్రైబ్యునల్ వాట్సాప్ డేటా షేరింగ్‌పై ఐదేళ్ల నిషేధాన్ని రద్దు చేసింది. అయితే రూ.213 కోట్ల జరిమానాను మాత్రం యథాతథంగా ఉంచింది. తాజాగా ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం మెటా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement