త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gyanesh Kumar | భారత EVMలకు ఇంటర్నెట్​, బ్లూటూత్​ క‌నెక్టివిటీ ఉండ‌దు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్

Gyanesh Kumar | మ‌న దేశంలో ఉప‌యోగించే ఈవీఎంలు పూర్తిగా సుర‌క్షిత‌మైన‌వ‌ని భార‌త ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (Chief Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) తెలిపారు. వాటికి ఇంట‌ర్నెట్‌, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ లాంటి సదుపాయాలు ఏవీ ఉండవని స్పష్టం చేశారు.

D

National | Published On Aug 24, 2026, 5.08 pm IST

Gyanesh Kumar | భారత EVMలకు ఇంటర్నెట్​, బ్లూటూత్​ క‌నెక్టివిటీ ఉండ‌దు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్
Advertisement

Gyanesh Kumar | త్రినేత్ర‌.న్యూస్ : మ‌న దేశంలో ఉప‌యోగించే ఈవీఎంలు పూర్తిగా సుర‌క్షిత‌మైన‌వ‌ని ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (Chief Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) తెలిపారు. వాటికి ఇంట‌ర్నెట్‌, బ్లూటూత్, వైఫై వంటి వైర్‌లెస్‌ కనెక్టివిటీ సదుపాయాలు ఏవీ ఉండవని స్పష్టం చేశారు. లక్నో (Lucknow)లోని చారిత్రాత్మక కాల్విన్ తాలుక్దార్స్ కళాశాల (Colvin Taluqdars College)లో విద్యార్థులతో సీఈసీ ముచ్చ‌టించారు.

ఈ సందర్భంగా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల (EVMs) విశ్వసనీయత, యువ ఓటర్ల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భార‌త్‌లో ఉప‌యోగించే ఈవీఎంలు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లే త‌యారు చేస్తాయ‌ని చెప్పారు. వీటికి ఎలాంటి వైర్‌లెస్ లేదా ఇంటర్నెట్ టెక్నాలజీతో అనుసంధానం ఉండదని స్ప‌ష్టం చేశారు. వీటిని హ్యాక్ చేసే అవ‌కాశ‌మే లేద‌ని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇంతటి బృహత్తర ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఎంతో మంది సిబ్బంది శ్రమిస్తున్నారని వివ‌రించారు.

ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌లో యువ‌త చురుగ్గా పాల్గొనాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. దేశ భ‌విష్య‌త్తుకు యువ‌తే అత్యంత కీల‌క‌మైన శ‌క్తి అని చెప్పారు. యువ‌త అవ‌గాహ‌న‌తో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పాల్గొంటే.. ప్ర‌జాస్వామ్యం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చారు. అదేవిధంగా యువ‌త సోష‌ల్ మీడియా ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు, లేదా ఇతరులతో దాన్ని పంచుకునే ముందు కచ్చితంగా దాని మూలాలను, ప్రామాణికతను సరిచూసుకోవాలని యువ‌త‌కు సూచించారు.

Also Read..

యూపీఐకి ప‌దేళ్లు.. వృద్ధి ప్ర‌యాణంలో 2026 ఏడాది కీల‌కం

జీవో 97 రగడ: పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన వెనుక అసలు నిజాలేంటి? అకడమిక్ వర్గాల బిగ్ సొల్యూషన్!

15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ‌

Advertisement
Advertisement