త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Payal Shankar | విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆవేద‌న రేవంత్‌కు క‌నిపిస్త‌లేదా?: ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌

Payal Shankar | రాష్ట్రంలో దాదాపు 20 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఫీజు బ‌కాయిలు రాక వారి త‌ల్ల‌దండ్రులు ప‌డుతున్న ఆవేద‌న సీఎం రేవంత్‌రెడ్డికి క‌నిపిస్త‌లేదా అని ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ ప్ర‌శ్నించారు. రేవంత్ అధికారంలోకి రాక‌ముందు, ముఖ్య‌మంత్రి అయినంక మాట్లాడే మాట‌ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంద‌న్నారు.

S

Telangana | Published On Aug 24, 2026, 4.24 pm IST

Payal Shankar | విద్యార్థుల త‌ల్లిదండ్రుల ఆవేద‌న రేవంత్‌కు క‌నిపిస్త‌లేదా?: ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌
Advertisement

Payal Shankar | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో దాదాపు 20 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఫీజు బ‌కాయిలు రాక వారి త‌ల్ల‌దండ్రులు ప‌డుతున్న ఆవేద‌న సీఎం రేవంత్‌రెడ్డికి క‌నిపిస్త‌లేదా అని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ ప్ర‌శ్నించారు. రేవంత్ అధికారంలోకి రాక‌ముందు, ముఖ్య‌మంత్రి అయినంక మాట్లాడే మాట‌ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంద‌న్నారు. ప‌దేండ్లు పాలించిన బీఆర్ఎస్ విద్యార్థుల గోస ఎలా పుచ్చ‌కుందో కాంగ్రెస్ కూడా అదే పంథాను అవ‌లంబిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఫీజు బ‌కాయిలు-బీజేపీ ల‌డాయి దీక్ష‌లో సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ రేవంత్‌, రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఫీజు బ‌కాయిలు రాక కొన్ని సంద‌ర్భాల్లో విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూడా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌రు. ఈ ప్ర‌భుత్వ‌మేమో మాకేం సంబంధం లేన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. యువ‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని సీఎం మాట్లాడుతున్న‌డు.. మ‌రి ఫీజు బ‌కాయిలు ఎందుకు గుర్తొస్త‌లేవు? బీజేపీ త‌ర‌ఫున విద్యార్థుల‌కు భ‌రోసా ఇస్తున్నం. మీరెవ‌రు అధైర్య‌ప‌డ‌కండి.

రాహుల్ ప్ర‌ధాని అవ్వాల‌ని మాట్లాడే సీఎం విద్యార్థుల చ‌దువుల గురించి ఎందుకు మాట్లాడ‌రు? వారి బాధ్య‌త‌ల‌ను ఎందుకు మ‌రుస్తున్న‌రు. కాంగ్రెస్ మాట్లాడే ప‌రిస్థితి క‌నిపిస్త‌లేదు. ఎక్క‌డో చిన్న ఇది జ‌రిగితే భూత‌ద్దంలో చూపించి మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో జ‌రుగుతున్న త‌ప్పుల‌ను, కాంగ్రెస్ విద్యార్థుల‌ను వేధిస్తున్న తీరు.. కాంగ్రెస్ విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ఇస్తున్న బాధ ఈ రాహుల్ గాంధీకి క‌నిపిస్త‌లేవా?

ఈ దీక్ష‌తోనే ప్ర‌భుత్వం క‌ళ్లు తెర‌వాలి..

కాంగ్రెస్‌కు ఏమాత్రం ప్రేమ ఉన్నా విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెద‌ప‌డు? తెలంగాణ ప్ర‌జ‌లకు స‌మాధానం చెప్పాలి. ఈ ఉద్య‌మం కేవ‌లం 48 గంట‌ల దీక్ష‌తోనే ఆగిపోదు. ఇక్క‌డి నుంచే కాంగ్రెస్‌ను హెచ్చ‌రిస్తున్నం. ఈ దీక్ష‌తోనే ప్ర‌భుత్వం క‌ళ్లు తెర‌వాలి. వెంట‌నే బ‌కాయిలు విడుద‌ల చేయాలి. విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు బీజేపీ అండ‌గా ఉంటుంది. విద్యార్థుల త‌ర‌ఫున పోరాటం చేస్తూనే ఉంటం అని పాయ‌ల్ శంకర్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement