త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Challans | వాహనదారులకు షాక్: చలాన్ పడగానే బ్యాంకు నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్.. సీఎం రేవంత్ ఆదేశం

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. వాహనంపై చలాన్ పడగానే నేరుగా బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కట్ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంక్ వివరాలను అనుసంధానం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

J

Telangana | Published On Jan 12, 2026, 8.47 pm IST

Traffic Challans | వాహనదారులకు షాక్: చలాన్ పడగానే బ్యాంకు నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్.. సీఎం రేవంత్ ఆదేశం

సంక్షిప్త సారాంశం

యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈసందర్భంగా రవాణా శాఖ అధికారులకు కీలక ప్రతిపాదనలు చేశారు. పెండింగ్ చలాన్ల సమస్యకు చెక్ పెట్టేందుకు, ట్రాఫిక్ రూల్ అతిక్రమించిన వెంటనే వాహన యజమాని ఖాతా నుండి ఆటోమేటిక్‌గా జరిమానా మొత్తం కట్ అయ్యే (Auto-debit) వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ఇందుకోసం కొత్త వాహన రిజిస్ట్రేషన్ల సమయంలోనే బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించి, వాటిని వాహన డేటాతో సింక్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Traffic Challans | ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్ పడగానే, వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ (Auto-Debit) అయ్యే వ్యవస్థను తీసుకురావాలని రవాణా శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈసందర్భంగా రవాణా శాఖ అధికారులకు కీలక ప్రతిపాదనలు చేశారు.

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమానుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి, వాటిని వాహన వివరాలతో సింక్ చేయాలని సీఎం సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చూడటం, పెండింగ్ చలాన్ల సమస్యను పరిష్కరించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని రేవంత్ పేర్కొన్నారు. రవాణా శాఖలో పారదర్శకత పెంచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, అవసరమైతే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement