త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Challans | ఇలా చేస్తే ట్రాఫిక్‌ చ‌లాన్ల వివ‌రాలు ఈజీగా తెలుసుకోవ‌చ్చు..!

Traffic Challans | వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌. ట్రాఫిక్ చ‌లాన్ల‌కు (Traffic Challans) సంబంధించిన‌ స‌మాచారం త‌మ‌కు రాలేదు, మెసేజ్ అంద‌లేదు, విష‌యం తెలియ‌దు అంటే ఇక‌పై కుద‌ర‌దు. చ‌లాన్ల స‌మాచారం ప్ర‌తి వాహ‌న య‌జ‌మానికి చేరేలా ర‌వాణా శాఖ కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ది.

G

Telangana | Published On Jun 2, 2026, 6.28 am IST

Traffic Challans | ఇలా చేస్తే ట్రాఫిక్‌ చ‌లాన్ల వివ‌రాలు ఈజీగా తెలుసుకోవ‌చ్చు..!
Advertisement

Traffic Challans | త్రినేత్ర‌.న్యూస్‌: వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌. ట్రాఫిక్ చ‌లాన్ల‌కు (Traffic Challans) సంబంధించిన‌ స‌మాచారం త‌మ‌కు రాలేదు, మెసేజ్ అంద‌లేదు, విష‌యం తెలియ‌దు అంటే ఇక‌పై కుద‌ర‌దు. చ‌లాన్ల స‌మాచారం ప్ర‌తి వాహ‌న య‌జ‌మానికి చేరేలా ర‌వాణా శాఖ కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ది. దీనిప్ర‌కారం వాహ‌న య‌జ‌మానులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ వ్య‌క్తిగత వివ‌రాల‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను వాహన్ పోర్టల్ (Vahan Portal) vahan.parivahan.gov.inలో తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కింది. దీనికోసం ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది.

దీంతో ట్రాఫిక్ చలాన్లు, ఇతర రవాణా శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్‌, ఈ-మెయిల్ ద్వారా వాహన యజమానులకు పంపించనున్నారు. దీంతో చలాన్ల విషయంలో పారదర్శకత పెరగడమే కాకుండా, పెండింగ్ బకాయిల వసూళ్లు కూడా వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అందువ‌ల్ల వాహ‌న‌దారులు నిర్దేశిత గ‌డువులోగా వాహ‌న్ పోర్ట‌ల్‌లో త‌మ వివ‌రాల‌ను అప్‌డేట్ చేసుకోవాల‌ని అధికారులు కోరారు.

వాహ‌నాల డేటాను ఒకే చోట

ఈ ఏడాది మార్చి 24న వాహ‌న్ పోర్ట‌ల్‌లో తెలంగాణ చేరింది. వ‌న్ నేష‌న్‌-వ‌న్ రిజిస్ట్రీ ల‌క్ష్యంతో దేశ‌వ్యాప్తంగా వాహ‌నాల డేటాను ఒకే చోట చేర్చేందుకు కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ ఈ జాతీయ వాహ‌న రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసింది. దీనివ‌ల్ల ర‌వాణా శాఖ‌లోని పౌర‌సేవ‌లు మ‌రింత సుల‌భ‌త‌రం, పార‌ద‌ర్శ‌కం కానున్నాయి.

ఏ సేవలు అందుతాయి?

ఈ పోర్ట‌ల్ ద్వారా 52 రకాల వాహన సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. త‌ద్వారా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి లేదా మొబైల్ నుంచి ఓటీపీతో పని పూర్త‌వుతుంది.

  • కొత్త వాహన రిజిస్ట్రేషన్.. ఇది షోరూమ్‌లోనే పూర్తి అవుతుంది. ఆర్టీఏ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు.
  • RC బదిలీ (Ownership Transfer)
  • అడ్రస్ మార్పు (Address Change)
  • పేరు మార్పు
  • డూప్లికేట్ RC
  • పన్ను చెల్లింపు (Tax Payment)
  • హైపోథికేషన్ (లోన్) అప్‌డేట్ & టెర్మినేషన్
  • ఇంటర్‌స్టేట్ వాహన బదిలీలు (ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చేవి లేదా వెళ్లేవి)
  • ఫాన్సీ నంబర్ అలాట్‌మెంట్

 

Advertisement
Advertisement