Ghatkesar Bandh | రైల్వే వంతెన కోసం ఘట్‌కేసర్ బంద్.. మూతపడి విద్యాసంస్థలు, దుకాణాలు
Ghatkesar Bandh | మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో (Ghatkesar) ఏండ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న రైల్వే వంతెన నిర్మాణ పనులును (Rail over Bridge) తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ కొనసాగుతున్నది. 18 ఏండ్ల ఎదురుచూపులకు ఇకనైనా ముగింపు పలకాలంటూ ఘట్‌కేసర్ పట్టణంలో వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Ghatkesar Bandh) పాటిస్తున్నాయి.
Ghatkesar Bandh | త్రినేత్ర న్యూస్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో (Ghatkesar) ఏండ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న రైల్వే వంతెన నిర్మాణ పనులును (Rail over Bridge) తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ కొనసాగుతున్నది. 18 ఏండ్ల ఎదురుచూపులకు ఇకనైనా ముగింపు పలకాలంటూ ఘట్‌కేసర్ పట్టణంలో వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Ghatkesar Bandh) పాటిస్తున్నాయి. కాలేజీలు, పాఠశాలలు మూతపడ్డాయి. ఏండ్లుగా పోరాడుతున్నా పరిష్కారం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

రైల్వే వంతెన (Railway Bridge) నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు వంతెనకు ఇరువైపులా రహదారులను విస్తరించాలని కోరుతున్నారు. జిల్లా బస్సులను ఘట్‌కేసర్ పట్టణం మీదుగా నడపాలని చెప్పారు. రైల్వే వంతెన సాధన పోరాటం పార్టీలకతీతంగా సాగుతున్నదని, ప్రజలంతా స్వచ్ఛందంగా ఇందులో పాల్గొంటున్నారని వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●AAP MLAs join BJP | పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
- ●Elon Musk | గ్రోక్ వినియోగదారులకు షాక్.. త్వరగా ముగుస్తున్న పరిమితులు.. మస్క్ ఏమన్నారంటే..?
- ●Delhi Pollution Curbs | ఢిల్లీలో వాయు కాలుష్యం.. వాహనదారులపై కొరడా ఝుళిపించిన అధికారులు.. తొలిరోజే రూ.68 లక్షల ఫైన్ వసూలు
- ●Nitin Nabin | దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
- ●Gold And Silver Prices Today | మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్..
- ●Instinct AI | వాట్సాప్‌లో ఏఐ అసిస్టెంట్ ఇన్‌స్టింక్ట్‌పై వివాదం.. యూజర్ ఖాతా బ్యాన్..

AAP MLAs join BJP | పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు

Elon Musk | గ్రోక్ వినియోగదారులకు షాక్.. త్వరగా ముగుస్తున్న పరిమితులు.. మస్క్ ఏమన్నారంటే..?

Delhi Pollution Curbs | ఢిల్లీలో వాయు కాలుష్యం.. వాహనదారులపై కొరడా ఝుళిపించిన అధికారులు.. తొలిరోజే రూ.68 లక్షల ఫైన్ వసూలు

Nitin Nabin | దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్





