త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paper Leak Law | పేప‌ర్ లీక్ క‌ట్ట‌డికి కేంద్రం క‌ఠిన చ‌ర్య‌లు.. 10 ఏళ్ల జైలు శిక్ష‌, రూ.కోటి జ‌రిమానా..?

Paper Leak Law | నీట్ పేప‌ర్ లీక్‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌ర‌మైన నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. దోషులుగా తేలిన వారికి 5 నుంచి 10 ఏళ్ల‌పాటూ జైలు శిక్ష, కనిష్టంగా రూ. 1 కోటి జరిమానా విధించేలా 2024లో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చ‌ట్టాన్ని స‌వ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

D

National | Published On Jul 24, 2026, 11.42 am IST

Paper Leak Law | పేప‌ర్ లీక్ క‌ట్ట‌డికి కేంద్రం క‌ఠిన చ‌ర్య‌లు.. 10 ఏళ్ల జైలు శిక్ష‌, రూ.కోటి జ‌రిమానా..?
Advertisement

Paper Leak Law | నీట్ పేప‌ర్ లీక్‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌ర‌మైన నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. పేప‌ర్ లీక్‌ల‌ను (Paper Leak) అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు (Paper Leak Law) ప్ర‌వేశ‌పెడుతామ‌ని ప్ర‌ధాని మోదీ (PM Modi) స్వ‌యంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం జ‌రిగే కేంద్ర కేబినెట్ (Cabinet Meet) స‌మావేశంలో లీకేజీల నిరోధ‌క చ‌ట్టాన్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేసే ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇందులో భాగంగా మోదీ ప్రభుత్వం జూన్ 2024లో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) చట్టం, 2024లో కీల‌క మార్పులు చేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ చ‌ట్టం కింద క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. నీట్‌, జేఈఈ వంటి పోటీ ప‌రీక్ష‌లు స‌హా ప్రభుత్వ పరీక్షల్లో పేప‌ర్ లీక్‌లు, అక్ర‌మాల‌కు పాల్ప‌డి దోషులుగా తేలిన వారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. 3 నుంచి 5 సంవత్సరాల పాటూ జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ శిక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌నున్నారు. 5 నుంచి 10 ఏళ్ల‌పాటూ జైలు శిక్ష, కనిష్టంగా రూ. 1 కోటి జరిమానా విధించేలా చ‌ట్టాన్ని స‌వ‌రించ‌నున్న‌ట్లు సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

పేప‌ర్ లీక్‌లు అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు

కాగా, నీట్ పేప‌ర్ లీక్‌, దేశ విద్యా వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల‌పై దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు నిర‌స‌న‌లు తీవ్ర‌త‌రం చేసిన విష‌యం తెలిసిందే. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను (Fast-track court) ఏర్పాటు చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప్ర‌ధాని మోదీ.. పేప‌ర్ లీక్‌ల‌ను (Paper Leak) అరిక‌ట్టేలా పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ‌పెడుతామ‌ని తాజాగా ప్ర‌క‌టించారు. ఈమేర‌కు అర్ధ‌రాత్రి ఒక సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు.

‘పేపర్‌ లీక్‌ అనేది సాధారణ అంశం కాదని నాకు తెలుసు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపాం. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకూడ‌ద‌ని తిరిగి పరీక్ష నిర్వహించాం. లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్రంగా బాధించింది. అందుకే గత రెండున్నర నెలల్లో పలు చర్యలు తీసుకున్నాం. మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం. అందుకే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించా. ప‌రీక్ష విధానంలో సంస్క‌ర‌ణ‌లు తెస్తాం. శుక్రవారం జరిగే క్యాబినెట్‌ భేటీలో ప్ర‌త్యేక‌ బిల్లుపై చర్చిస్తాం. త్వరలో పార్లమెంటులో బిల్లు పెడతాం’ అని వీడియో సందేశంలో ప్రధాని వివరించారు.

Advertisement
Advertisement