CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!
CEC Removal Process | కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై విపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ మరోసారి పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. రానున్న రెండు వారాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ మేరకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
CEC Removal Process | కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై విపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలంటూ మరోసారి పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. రానున్న రెండు వారాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ మేరకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాల మద్దతుతో ఈ ప్రయత్నం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 56 మంది, లోక్‌సభలో 100 మందికి పైగా ఎంపీలు ఈ నోటీసుపై సంతకాలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీఈసీని తొలగించాలంటే కేవలం పార్లమెంట్‌లో తీర్మానం పెట్టడం సరిపోదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే స్థాయిలో కఠినమైన రాజ్యాంగ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. అసలు సీఈసీని ఎలా తొలగిస్తారు? ఎంతమంది ఎంపీల సంతకాలు అవసరం? ఆరోపణలపై విచారణ ఎలా జరుగుతుంది? 2023లో వచ్చిన కొత్త చట్టంతో ఏం మారింది? గతంలో ఎవరైనా సీఈసీ ఈ ప్రక్రియ ద్వారా తొలగించారా? తెలుసుకుందాం.
సీఈసీపై విపక్షాల అభ్యంతరాలేంటి?
ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాలపై విపక్షాలు కొంతకాలంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల సంఘంలోని సభ్యుల మధ్య కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు వచ్చిన నివేదికలు కూడా ఈ వివాదాన్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేశారు. తాజాగా పార్లమెంట్‌లో ఆయనను తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి కాదు. 2026 మార్చి 12న కూడా టీఎంసీ నేతృత్వంలోని విపక్షాలు జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలంటూ లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇచ్చాయి. లోక్‌సభ నోటీసుపై 130 మంది, రాజ్యసభ నోటీసుపై 63 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అయితే ఏప్రిల్‌లో ఈ రెండు నోటీసులను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు.
సీఈసీని తొలగించేది ఎవరు?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) సీఈసీ పదవికి ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ ప్రాతిపదికన తొలగించవచ్చో.. అదే ప్రాతిపదికన సీఈసీని కూడా తొలగించవచ్చు. అంటే.. తప్పు ప్రవర్తన (proved misbehaviour), అసమర్థత (incapacity) రుజువైతేనే సీఈసీని తొలగించే అవకాశం ఉంటుంది. కేవలం ఒక నిర్ణయంపై అసమ్మతి, రాజకీయ విమర్శలు లేదంటే వివాదాలు మాత్రమే సీఈసీని తొలగించడానికి సరిపోదు. రాజకీయ చర్చల్లో ఈ ప్రక్రియను సాధారణంగా ‘ఇంపీచ్‌మెంట్’ అని పిలుస్తున్నప్పటికీ.. రాజ్యాంగపరంగా ‘ఇంపీచ్‌మెంట్’ అనే పదాన్ని రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియకు ఉపయోగిస్తారు. సీఈసీ, న్యాయమూర్తుల విషయంలో ఇది ‘రిమూవల్’ ప్రక్రియ.
ఎంతమంది ఎంపీల సంతకాలు కావాలి?
సీఈసీ తొలగింపు తీర్మానాన్ని పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభలో నోటీసు ఇవ్వాలంటే కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. రాజ్యసభలో నోటీసు ఇవ్వాలంటే కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేయాలి. ఈ నోటీసును లోక్‌సభలో స్పీకర్‌కు, రాజ్యసభలో చైర్మన్‌కు సమర్పించాలి. ఈ ఏడాది మార్చిలో విపక్షాలు ఇచ్చిన నోటీసులకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది ఎంపీలు సంతకాలు చేశారు. అయితే సంతకాలు సరిపోవడం మాత్రమే తొలగింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు కాదు. సంబంధిత సభాధ్యక్షుడు నోటీసును అంగీకరించాల్సి ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ నోటీసును అంగీకరిస్తే.. తదుపరి దశ మొదలవుతుంది. ఆరోపణలపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ న్యాయ నిపుణుడు ఉంటారు. ఈ కమిటీ ఆరోపణలపై విచారణ చేపడుతుంది. సీఈసీకి తన వాదనను వినిపించుకునే, తనపై వచ్చిన ఆరోపణలను సమర్థించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ Judges (Inquiry) Act, 1968లోని నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతుంది. విచారణ కమిటీ ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చితే అక్కడితో ప్రక్రియ ముగుస్తుంది. సీఈసీని తొలగించే తీర్మానం ముందుకు వెళ్లదు. అదే ఆరోపణలు నిరూపితమయ్యాయని తేల్చితే.. కమిటీ తన నివేదికను సంబంధిత పార్లమెంట్ సభకు సమర్పిస్తుంది.
రెండు సభల్లోనూ మెజారిటీ తప్పనిసరి..
విచారణ కమిటీ నివేదిక తర్వాత కూడా సీఈసీ తొలగింపు వెంటనే జరగదు. రెండు సభల్లోనూ తీర్మానం ఆమోదం పొందాలి. ఇందుకు ప్రత్యేక మెజారిటీ అవసరం. అంటే.. సభ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ ఉండాలి. అదే సమయంలో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలి. ఈ రెండు షరతులు లోక్‌సభ, రాజ్యసభ రెండింటికీ వర్తిస్తాయి. రెండు సభలు తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత.. సీఈసీని పదవి నుంచి తొలగించాలంటూ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతికి అధికారికంగా అడ్రస్ పంపుతారు. అనంతరం రాష్ట్రపతి తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తారు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ సీఈసీని కూడా ఈ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించలేదు. జ్ఞానేశ్ కుమార్‌పై 2026 మార్చిలో ఇచ్చిన నోటీసులు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచాయి. అయితే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వాటిని ఏప్రిల్‌లో తిరస్కరించడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
2023 చట్టంతో ఏం మారింది?
2023లో కేంద్రం సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని పూర్తి పేరు ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల యాక్ట్ (Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023) ఈ చట్టానికి ముందు.. 2023లో అనూప్ బరన్‌వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్లమెంట్ నియామక విధానంపై చట్టం చేసే వరకు సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లను ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సిఫార్సు మేరకు నియమించాలని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ తర్వాత పార్లమెంట్ తీసుకొచ్చిన 2023 చట్టంలో నియామక కమిటీ కూర్పు మారింది.
కొత్త సెలక్షన్ కమిటీలో ఎవరుంటారు?
2023లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం.. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్మన్‌గా ఉంటారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమిస్తుంది. అంటే.. అనూప్ బరన్‌వాల్ తీర్పులోని కమిటీలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రి వచ్చారు. ఈ మార్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2023 చట్టంలోని ఎంపిక విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల మధ్య కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారాన్ని తగిన సంఖ్యలో న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని ఇద్దరు న్యాయమూర్తులు అంగీకరించారు. అయితే, ఈ పరిణామం 2023 చట్టాన్ని రద్దు చేసినట్లు కాదు. చట్టం చెల్లుబాటుపై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది.
పదవీకాలం, అర్హతల్లోనూ మార్పులు
2023 చట్టం సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల పదవీకాలం, అర్హతలు, వేతనాలకు సంబంధించిన నిబంధనలను కూడా నిర్దేశించింది. పదవీకాలం గరిష్టంగా ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు వరకు.. ఏది ముందైతే అది వర్తిస్తుంది. తిరిగి నియామకానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా సమాన హోదాలో పనిచేసిన అనుభవం, ఎన్నికల నిర్వహణపై పరిజ్ఞానం ఉండాలి. ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ఐదుగురి పేర్లతో ప్యానెల్ రూపొందిస్తుంది. అయితే సెలక్షన్ కమిటీ ఆ ఐదుగురికే పరిమితం కాకుండా ఇతర పేర్లను కూడా పరిశీలించవచ్చు. వేతనాల విషయంలో గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉండగా.. 2023 చట్టం ప్రకారం కేబినెట్ సెక్రటరీ స్థాయికి అనుగుణంగా నిర్ణయించారు. అయితే ఈ మార్పులన్నింటికంటే కీలకమైన విషయం ఒక్కటే.. సీఈసీని తొలగించే రాజ్యాంగపరమైన విధానంలో మాత్రం 2023 చట్టం ఎలాంటి మార్పు చేయలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే స్థాయిలోనే కఠినమైన ప్రక్రియను ఇప్పటికీ అనుసరించాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం విపక్షాలు సీఈసీపై మరోసారి తొలగింపు నోటీసు ఇవ్వనున్నట్లు చెబుతున్నప్పటికీ.. అది కేవలం పార్లమెంట్‌లో నోటీసు ఇవ్వడంతో ముగిసే వ్యవహారం కాదు. నోటీసు ఆమోదం, విచారణ, ఆరోపణల నిరూపణ, రెండు సభల్లో ప్రత్యేక మెజారిటీ, చివరగా రాష్ట్రపతి ఉత్తర్వు.. ఇలా పలు దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

INDIA | సీఈసీ రాజీనామాకు డిమాండ్.. సెప్టెంబర్ 30న ఇండీ కూటమి కీలక భేటీ
సెప్టెంబర్ 26, 2026

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్
సెప్టెంబర్ 26, 2026

SIR నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిశంసన డిమాండ్ దాకా.. ఏం జరిగింది?
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..
- ●Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు
- ●Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు
- ●Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
- ●Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
- ●Duronto Express Stone Pelting | పట్టాలపై దారుణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. భోజనం చేస్తున్న ప్రయాణికుల పక్కనే పగిలిన కిటికీ అద్దాలు

NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..

Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు

Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు

Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్



