Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు
Uttam Kumar Reddy | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్ రెండోవారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మూడు బ్యారేజీల భద్రతను పటిష్టం చేయడంతోపాటు నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని వెల్లడించారు.
- 2027 వర్షాకాలానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తి
- అక్టోబర్ 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందుకు డిజైన్లు
- భద్రత, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
- జాతీయ సంస్థల సూచనల మేరకే పనులు
- మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Uttam Kumar Reddy | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్ రెండోవారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మూడు బ్యారేజీల భద్రతను పటిష్టం చేయడంతోపాటు నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని వెల్లడించారు. బేగంపేట కుందన్‌బాగ్‌లోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో శనివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి బ్యారేజీల పునరుద్ధరణ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పునరుద్ధరణ పనుల ప్రణాళిక, డిజైన్ల పరిశీలన, సాంకేతిక అనుమతులు, టెండర్ల ప్రక్రియ, పనుల అమలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
పునాదుల బలోపేతం..
ప్రాజెక్టు డిజైనర్ రూపొందించిన పునరుద్ధరణ ప్రణాళికలో గ్రౌటింగ్ ద్వారా పునాదులను బలోపేతం చేయడం, స్టిల్లింగ్ బేసిన్లను పొడిగించడం, కొత్తగా కట్-ఆఫ్ వాల్స్ నిర్మించడం వంటి కీలక పనులు ఉన్నాయని మంత్రి తెలిపారు. వరద ప్రవాహ వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లలో ఉన్న లోపాలను సరిచేయడంతోపాటు పునాదుల స్థిరత్వాన్ని పెంచడం, పునాదుల కింద నీటి చొరబాటును అరికట్టడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని వివరించారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ)తోపాటు ఇతర నిపుణుల కమిటీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. “బ్యారేజీల నిర్మాణ భద్రత, పునరుద్ధరణ పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. శాస్త్రీయ అధ్యయనాలు, జాతీయ స్థాయి సాంకేతిక సంస్థల సిఫార్సుల ఆధారంగానే ప్రతి పని జరుగుతుంది” అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
సీడబ్ల్యూఆర్‌ఆర్‌ఎస్‌లో డిజైన్ల పరీక్షలు
ప్రతిపాదిత డిజైన్లను పుణేలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధనా కేంద్రం (సీడబ్ల్యూఆర్‌ఆర్‌ఎస్)లో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ నమూనాల ద్వారా పరీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వివిధ స్థాయిల్లో వరద ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీల వద్ద నీటి ప్రవాహ తీరు ఎలా ఉంటుందో, ప్రతిపాదించిన చర్యలు ఎంత సమర్థంగా పనిచేస్తాయో ఈ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారని చెప్పారు. ఖరారు చేసిన డిజైన్లను అక్టోబర్ 5న న్యూఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు ఉంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. కమిటీ నిపుణులు వాటిని పరిశీలించి అవసరమైన సూచనలు, సిఫార్సులు చేస్తారని తెలిపారు. సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను ఏకకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనుమతులు రాగానే టెండర్లు..
పునరుద్ధరణ పనులకు సంబంధించిన సమగ్ర వ్యయ అంచనాలను నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ సిద్ధం చేస్తోందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ అనుమతి కోసం అవసరమైన కాంట్రాక్టు విధానాన్ని కూడా ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. డిజైన్లకు అనుమతి లభించిన వెంటనే టెండర్లు పిలిచి, పనులను అప్పగించేలా మొత్తం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనుల అమలులో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, స్వతంత్ర పరీక్షలు, స్పష్టమైన కాలపరిమితులు ఉండాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
తాత్కాలిక మరమ్మతులు కాదు..
తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా, సాంకేతికంగా పటిష్టమైన, దీర్ఘకాలం మన్నే విధానాలతో మూడు బ్యారేజీలను పునరుద్ధరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. “పునరుద్ధరణ పనులు పూర్తయి, జాతీయ సాంకేతిక సంస్థల నుంచి అవసరమైన భద్రతా అనుమతులు వచ్చిన తర్వాతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తిరిగి నిర్వహణలోకి తీసుకొస్తాం” అని మంత్రి తేల్చిచెప్పారు. డిజైన్ల పరిశీలన నుంచి టెండర్లు, పనుల అమలు, తుది భద్రతా ధ్రువీకరణ వరకు ప్రతి దశను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటిస్తూ, ప్రతి దశను నిపుణుల పరిశీలనకు లోబడి నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కార్యక్రమంతో సంబంధం ఉన్న ఇంజినీర్లు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rajanna Sircilla | సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
సెప్టెంబర్ 26, 2026

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
సెప్టెంబర్ 26, 2026

Asian Games | కబడ్డీలో భారత్ పసిడి పంచ్.. ఇరాన్‌పై 40-34తో ఘన విజయం
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి
- ●Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
- ●Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి
- ●Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా
- ●KTR | పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు
- ●Baanganga Gold & Diamonds | ఇన్వెస్టర్లకు అలర్ట్.. రూ.720 కోట్లకు ప్రముఖ కంపెనీ ఐపీఓ..

Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి

Ntr | సర్జరీ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు ఎన్టీఆర్ - రాజమౌళి కొడుకు సినిమాకు గెస్ట్‌గా



