త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Duronto Express Stone Pelting | పట్టాలపై దారుణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. భోజనం చేస్తున్న ప్రయాణికుల పక్కనే పగిలిన కిటికీ అద్దాలు

మహారాష్ట్రలో దురంతో ఎక్స్‌ప్రెస్‌పై దుండగులు రాళ్ల దాడి చేశారు. ప్రయాణికులు భోజనం చేస్తుండగా అద్దాలు పగిలి లోపల పడ్డ దృశ్యాలు వైరల్ అయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.

J

Crime | Published On Sep 26, 2026, 4.12 pm IST

Duronto Express Stone Pelting | పట్టాలపై దారుణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. భోజనం చేస్తున్న ప్రయాణికుల పక్కనే పగిలిన కిటికీ అద్దాలు

సంక్షిప్త సారాంశం

నాగ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌పై బోర్ఖేడి స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో A-1, B-2, B-5 బోగీల కిటికీ అద్దాలు పగిలి లోపల కూర్చున్న ప్రయాణికులపై పడ్డాయి. ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆర్పీఎఫ్ (RPF), జీఆర్పీ (GRP) పోలీసులు రైల్వే చట్టం సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Duronto Express Stone Pelting | త్రినేత్ర న్యూస్ : రైలు ప్రయాణికులను మరోసారి భయాందోళనకు గురిచేసే ఘటన వెలుగుచూసింది. నాగ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలుపై మహారాష్ట్రలోని బోర్ఖేడి సమీపంలో శుక్రవారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. రైలు వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా రాళ్లు వచ్చి కిటికీలకు బలంగా తాకడంతో ప్రయాణికులు కూర్చున్న చోటే గ్లాస్ ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఇండియన్ రైల్వేస్ అధికారులు వెల్లడించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భయానక వీడియో

ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోగీలో ఐదుగురు ప్రయాణికులు కలిసి కూర్చుని డిన్నర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కిటికీ గ్లాస్ పగిలిపోయింది. గ్లాస్ ముక్కలు ప్రయాణికులకు కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే పడటంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాము నాగ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్నామని, భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఏదో వస్తువు బలంగా తాకి కిటికీ పగిలిపోయిందని ప్రయాణికుల్లో ఒకరు వీడియోలో వివరించారు.

మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. దురంతో ఎక్స్‌ప్రెస్‌లోని A-1, B-2, B-5 ఏసీ కోచ్‌ల కిటికీ అద్దాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. రాత్రి సుమారు 8:27 గంటల సమయంలో బయటి నుంచి ఏదో గట్టి వస్తువు లేదా రాయి వచ్చి కిటికీలను బలంగా తాకినట్లు రైలు ఎస్కార్ట్ సిబ్బంది, ప్రయాణికులు నిర్ధారించారు.

Also Read : Monkey | ఫుల్‌గా మందుకొట్టి ప‌డుకున్న కోతి.. VIDEO

అడ్రస్ దొరకని నిందితులు.. రంగంలోకి RPF, GRP

సమాచారం అందిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) బృందాలు రాత్రి 8:46 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోర్ఖేడి–సింధీ సెక్షన్‌లోని 803 నుంచి 796 కిలోమీటర్ల పరిధిలో, అలాగే సమీపంలోని బోర్ఖేడి, బ్రాహ్మణి గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు.

స్థానిక గ్రామ పోలీస్ పాటిల్ సహా పలువురు స్థానికులను విచారించినప్పటికీ, ఆ సమయంలో అనుమానాస్పద వ్యక్తులెవరూ కంటపడలేదు. ఎటువంటి ఆధారాలు కూడా వెంటనే లభించలేదు.

రైల్వే చట్టం కింద కేసు నమోదు

ఈ ఘటనపై శనివారం తెల్లవారుజామున 2:55 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 (రైలు ప్రయాణికుల భద్రతకు ఉద్దేశపూర్వకంగా ముప్పు కలిగించడం) కింద క్రైమ్ నంబర్ 325/2026 తో కేసు నమోదు చేశారు. రాళ్లు ఎక్కడి నుంచి విసిరారనే కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు రైల్వే భద్రతా విభాగం మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.

Advertisement
Advertisement