త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Illu | కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కే ఇందిర‌మ్మ ఇండ్లు

Indiramma Illu | అర్హులైన నిరుపేద‌లంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌న్న రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మ‌హిళ‌లు మండిప‌డ్డారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపిస్తూ నిజమైన పేదలకు ఎవరికి ఇచ్చారో చూపించాలని నిలదీశారు.

S

Telangana | Published On Sep 26, 2026, 4.28 pm IST

Indiramma Illu | కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కే ఇందిర‌మ్మ ఇండ్లు
Advertisement

ఇండ్ల మంత్రి పొంగులేటిపై మ‌హిళ‌ల ఫైర్

Indiramma Illu | త్రినేత్ర న్యూస్ : అర్హులైన నిరుపేద‌లంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌న్న రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మ‌హిళ‌లు మండిప‌డ్డారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపిస్తూ నిజమైన పేదలకు ఎవరికి ఇచ్చారో చూపించాలని నిలదీశారు. జ‌న‌గామ ప్రెస్ట‌న్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి పొంగులేటి ప్ర‌సంగిస్తుండ‌గా.. హామీల‌పై మ‌హిళ‌లు నిల‌దీస్తూ ఆయ‌న ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు.

కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తమ గ్రామంలో చేసిందేమీ లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెన్షన్ రూ.4 వేలు చేస్తామన్నారు.. ఏది?” అంటూ మంత్రిని ప్రశ్నించారు. “రూ.500కే గ్యాస్ అన్నారు.. ఇప్పుడు రూ.1000 చేశారు. రూ.500కే గ్యాస్ ఎవరికి ఇస్తున్నారో చూపించండి” అంటూ నిల‌దీశారు. అవన్నీ మాట్లాడొద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో వారిపైనా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement