CCPA | యాంటీ డ్రోన్ గన్‌పై ప్రకటన.. కంపెనీకి రూ.10 లక్షల జరిమానా
CCPA | నిబంధనలకు విరుద్ధంగా యాంటీ డ్రోన్ గన్‌ను ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచిన ఎయిర్‌వన్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ ఉత్పత్తికి సంబంధించి తప్పనిసరి వివరాలు వెల్లడించకుండా, అవసరమైన అనుమతులు లేకుండా ఈ-కామర్స్ వేదిక ఇండియామార్ట్‌లో ప్రకటనలు ఇచ్చినట్లు గుర్తించింది.
CCPA | నిబంధనలకు విరుద్ధంగా యాంటీ డ్రోన్ గన్‌ను ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచిన ఎయిర్‌వన్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ ఉత్పత్తికి సంబంధించి తప్పనిసరి వివరాలు వెల్లడించకుండా, అవసరమైన అనుమతులు లేకుండా ఈ-కామర్స్ వేదిక ఇండియామార్ట్‌లో ప్రకటనలు ఇచ్చినట్లు గుర్తించింది. ఈ చర్య వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, తప్పుడు ప్రకటనలు, అన్యాయ వాణిజ్య విధానాల కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇండియామార్ట్‌లో ‘యాంటీ డ్రోన్ గన్ VKSP03-PRO’ పేరుతో పూర్తి సాంకేతిక వివరాలు, రూ.8.30 లక్షల ధర, స్టాక్‌లో ఉందనే సమాచారంతో ఉత్పత్తిని అందుబాటులో ఉంచడాన్ని ప్రాధికార సంస్థ తీవ్రంగా పరిగణించింది. దీన్ని అమ్మే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.
కంపెనీ వివరణను తోసిపుచ్చిన సీసీపీఏ
అయితే, అది కేవలం పనిచేయని నమూనా (ఇనాక్టివ్ రెప్లికా) మాత్రమేనని కంపెనీ ఇచ్చిన వివరణను సీసీపీఏ తోసిపుచ్చింది. షోకాజ్ నోటీసు తర్వాత చేసిన ఈ వాదనకు ఆధారాలు లేవని, కంపెనీ ఇచ్చిన వివరణల్లోనూ పరస్పర విరుద్ధతలు ఉన్నాయని స్పష్టం చేసింది. ‘యాంటీ డ్రోన్ గన్’, ‘ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ డివైజ్’, ‘డ్రోన్ న్యూట్రలైజర్’ వంటి పదాలను కేవలం పరికరం రూపాన్ని వివరించేందుకు ఉపయోగించామన్న వాదననూ అంగీకరించలేదు. నిషేధిత ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలకు సంబంధించిన ప్రకటనలు వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం తప్పుడు ప్రకటనలు, అన్యాయ వాణిజ్య విధానాల కిందకు వస్తాయని సీసీపీఏ పేర్కొంది. వాస్తవంగా విక్రయాలు జరిగాయా? లేదా అది పనిచేయని నమూనాగా తర్వాత వెల్లడైందా? అన్న అంశాలతో కంపెనీ బాధ్యత తగ్గదని స్పష్టం చేసింది.
15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి
భవిష్యత్తులో చేసే ప్రకటనలు, ఆన్‌లైన్ జాబితాలు చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కంపెనీని ఆదేశించింది. పరికరాల పనితీరు, లభ్యత, చట్టబద్ధ వినియోగంపై తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేసినట్లు 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. వైర్‌లెస్ జామర్ల అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు 2022 ఏప్రిల్ 29న సీసీపీఏ ఈ-కామర్స్ వేదికలకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. లైసెన్స్ పొందిన జీపీఎస్, రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలకు అంతరాయం కలిగించే యాంటీ డ్రోన్ గన్‌ల విక్రయాలు పలు నియంత్రణ నిబంధనల పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వేదికలపై నిషేధిత పరికరాల ప్రచారం, విక్రయాలపై ప్రాధికార సంస్థ చర్యలు చేపడుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mysaa Postponed | రష్మిక మందన్న "మైసా" వాయిదా....సెన్సార్ రూల్స్ కారణమా?
- ●Nitin Nabin | రేపు కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు
- ●Nidhhi Agerwal | మలయాళంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్ - మైథాలజీ సినిమాలో హీరోయిన్గా!
- ●Ardhanareshwar Sculpture Elephanta Caves | అర్ధనారీశ్వర ఫోటోతో బీజేపీ, ఆరెస్సెస్‌లకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్
- ●Ponnam Prabhakar | రూ. 30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతాం
- ●PAC Meeting | 2027లో ఓబీసీ కుల గణన చేయాలి.. దీనిపై ప్రధానికి లేఖ రాస్తాం

Mysaa Postponed | రష్మిక మందన్న "మైసా" వాయిదా....సెన్సార్ రూల్స్ కారణమా?

Nitin Nabin | రేపు కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు

Nidhhi Agerwal | మలయాళంలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్ - మైథాలజీ సినిమాలో హీరోయిన్గా!

Ardhanareshwar Sculpture Elephanta Caves | అర్ధనారీశ్వర ఫోటోతో బీజేపీ, ఆరెస్సెస్‌లకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్





