త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CTI | బంగారం కొనొద్ద‌న్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్ర‌ధానికి సీటీఐ లేఖ‌!

CTI | బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో చేసిన విజ్ఞప్తి తమకు ఎంతో మేలు చేసిందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది. బంగారం ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో లక్షలాది మంది నగల వ్యాపారులు, ట్రేడర్లు, పెట్టుబడిదారులు భారీ నష్టాల నుంచి బయటపడ్డారని తెలిపింది.

P

Business | Published On Nov 22, 2026, 2.47 pm IST

CTI | బంగారం కొనొద్ద‌న్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్ర‌ధానికి సీటీఐ లేఖ‌!
Advertisement

CTI | బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో చేసిన విజ్ఞప్తి తమకు ఎంతో మేలు చేసిందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది. బంగారం ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో లక్షలాది మంది నగల వ్యాపారులు, ట్రేడర్లు, పెట్టుబడిదారులు భారీ నష్టాల నుంచి బయటపడ్డారని తెలిపింది. ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాసింది. ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రజలకు సూచించిన సమయంలో కిలో బంగారం ధర రూ.1.90 కోట్లుగా ఉందని సీటీఐ తన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఆ ధర రూ.1.25 కోట్లకు పడిపోయిందని తెలిపింది. అంటే కిలో బంగారంపై ఏకంగా రూ.65 లక్షల మేర ధర తగ్గిందని వివరించింది.

మోదీ మాట‌తో ఊర‌ట‌..

ఆ సమయంలో వ్యాపారులు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటే ఇప్పుడు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చేదని సీటీఐ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నగల వ్యాపారులు నెలల తరబడి సరిపడా బంగారు నిల్వలను ఉంచుకుంటారని గుర్తుచేసింది. పాత ధరల వద్ద స్టాక్ కొనుగోలు చేసి ఉంటే కోట్ల రూపాయల నష్టాలు ఎదురయ్యేవని పేర్కొంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికలపై బంగారం వ్యాపారం చేసే చిన్న వ్యాపారులకు సైతం మోదీ సూచన ఊరటనిచ్చిందని తెలిపింది. ప్రధాని విజ్ఞప్తి చేసినప్పుడు కొందరు విమర్శలు చేసినప్పటికీ.. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గడంతో ఆ సూచనలోని ప్రయోజనం అర్థమవుతోందని వెల్లడించింది. గతంలో మోదీ సలహాను వ్యతిరేకించిన వ్యాపారులు సైతం ఇప్పుడు దాని ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారని తెలిపింది. తమ సంస్థకు చెందిన వ్యాపారుల గ్రూపుల్లో 'మోదీజీ మమ్మల్ని కాపాడారు' అంటూ సందేశాలు వస్తున్నాయని పేర్కొంది. బంగారం, వెండి వంటి సున్నితమైన మార్కెట్ల విషయంలో ప్రజలకు ప్రధాని ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయాలని సీటీఐ కోరింది.

పెళ్లిళ్ల సీజన్‌లో సామాన్యులకు ఊరట

బంగారం ధరలు తగ్గడం వల్ల వ్యాపారులతో పాటు సామాన్య వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతోందని CTI తెలిపింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో తక్కువ ధరలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం కుటుంబాలకు లభించిందని పేర్కొంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 52 లక్షల వివాహాలు జరగనున్నట్లు అంచనా వేసింది. 'ప్రధాని మోదీజీ.. మీరు కేవలం ఒక సలహా మాత్రమే ఇవ్వలేదు. లక్షలాది కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా ఆదా చేశారు' అని తన లేఖలో ప్రశంసించింది. ఇదిలా ఉండ‌గా.. ఈ ఏడాది మే 10న సికింద్రాబాద్ వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌కు ప‌లు విజ్ఞ‌ప్తులు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి సూచనలు చేశారు. అయితే ఈ విజ్ఞప్తులపై ప్రతిపక్ష నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌, పవన్‌ ఖేరా, కార్తీ చిదంబరం తదితరులు విమర్శలు గుప్పించారు. బంగారం ధరల పతనం నేపథ్యంలో ప్రధాని గతంలో చేసిన విజ్ఞప్తికి వ్యాపార వర్గాల నుంచి ప్రశంసలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement