Ponnam Prabhakar | 11న ఆటోమోటివ్, ఈవీ రంగం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం
Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్రాన్ని ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగాల్లో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026 విజయవంతానికి
ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగాల్లో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026 సన్నాహాల్లో భాగంగా ఆటోమోటివ్, ఈవీ రంగాలకు సంబంధించి ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తన అధ్యక్షతన ఏర్పాటైన ఈ కౌన్సిల్‌లో ఆటోమోటివ్, ఈవీ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల ప్రతినిధులు, కీలక వాటాదారులు సభ్యులుగా ఉండనున్నారు. ఇప్పటికే సుమారు 25 మంది ప్రతినిధులు కౌన్సిల్‌లో భాగస్వాములయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 11న తెలంగాణ సచివాలయంలోని మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో తన అధ్యక్షతన ఆటోమోటివ్, ఈవీ రంగం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులతో నేరుగా చర్చించి తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, నూతన పెట్టుబడి ప్రతిపాదనలు, కంపెనీల విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై చర్చించనున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు.
ఈ సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన లాజిస్టిక్స్, సప్లై చైన్, ఆటోమోటివ్, ఈవీ విభాగం డైరెక్టర్ ఔజాద్ షేక్ సంబంధిత బృందాలతో సమన్వయం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR), పరిశ్రమల శాఖ మీడియా, కమ్యూనికేషన్స్ విభాగాలు సమావేశానికి తగిన ప్రచారం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాయని మంత్రి తెలిపారు.
సమావేశం ప్రధాన లక్ష్యాలు:
- తెలంగాణలో ఆటోమోటివ్, ఈవీ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలపై వివరాలు తెలుసుకోవడం.
- ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2026తో పాటు నిర్వహించే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పోలో ప్రముఖ కంపెనీలు చురుకుగా పాల్గొనేలా ఆహ్వానించడం.
- పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలపై పరిశ్రమల ప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరించడం.
- గ్లోబల్ సమ్మిట్‌లో ఆటోమోటివ్, ఈవీ రంగాలకు సంబంధించి నిర్వహించే ప్రత్యేక చర్చా వేదికల అంశాలను ఖరారు చేయడం.
- ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయం, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijayashanthi | బియ్యం పండించే రాష్ట్రంలోనే.. బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు వచ్చింది?: విజయశాంతి
నవంబర్ 6, 2026

Metro RTC Common Pass | రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ నెలవారీ పాస్ ధర
నవంబర్ 6, 2026

Medigadda Barrage Repair Cost | డిసెంబర్ నుంచే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు.. ఖర్చు ఏజెన్సీలదే
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Vijay Sethupathi International Emmy Awards | బట్టల దుకాణంలో సేల్స్‌మాన్ టు అంతర్జాతీయ వేదిక.. ఎమ్మీ అవార్డ్స్‌లో విజయ్ సేతుపతి సరికొత్త చరిత్ర
- ●REITs | రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి మరో మార్గం.. REITలతో అద్దె ఆదాయం..
- ●Vijayashanthi | బియ్యం పండించే రాష్ట్రంలోనే.. బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు వచ్చింది?: విజయశాంతి
- ●Nithya Raman | లాస్ ఏంజెల్స్ మేయర్‌గా తిరువనంతపురం బిడ్డ.. శశిథరూర్ హర్షం
- ●Nenavath Aravind Babu | కేసీఆర్‌కు తన రీసెర్చ్ అంకితమిచ్చిన నల్గొండ యువకుడు.. హరీశ్ రావు ప్రశంసలు
- ●Gold And Silver Prices Today | వీకెండ్ ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ.. భారీగా తగ్గిన పసిడి ధరలు..

Vijay Sethupathi International Emmy Awards | బట్టల దుకాణంలో సేల్స్‌మాన్ టు అంతర్జాతీయ వేదిక.. ఎమ్మీ అవార్డ్స్‌లో విజయ్ సేతుపతి సరికొత్త చరిత్ర

REITs | రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి మరో మార్గం.. REITలతో అద్దె ఆదాయం..

Vijayashanthi | బియ్యం పండించే రాష్ట్రంలోనే.. బియ్యం కొనలేని దుస్థితి ఎందుకు వచ్చింది?: విజయశాంతి

Nithya Raman | లాస్ ఏంజెల్స్ మేయర్‌గా తిరువనంతపురం బిడ్డ.. శశిథరూర్ హర్షం



