త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cabinet Decisions | దేశీయ సెమీకండక్టర్ రంగానికి భారీ బూస్ట్.. రూ.1.27 ల‌క్ష‌ల కోట్ల‌తో సెమికాన్ 2.0

Cabinet Decisions | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. భార‌త దేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM 2.0)కు ఆమోదం తెలిపింది.

D

National | Published On Jul 15, 2026, 5.30 pm IST

Cabinet Decisions | దేశీయ సెమీకండక్టర్ రంగానికి భారీ బూస్ట్.. రూ.1.27 ల‌క్ష‌ల కోట్ల‌తో సెమికాన్ 2.0
Advertisement

Cabinet Decisions | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. భార‌త దేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM 2.0)కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ద్వారా దాదాపు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, సెమీకండక్టర్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ కొత్త మిషన్‌లో భాగంగా చిప్ తయారీకి అవసరమైన ముడిసరకులు సరఫరా చేసే పరిశ్రమలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ పథకం ద్వారా భారత్ అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ హబ్‌గా మారడానికి, ఎలక్ట్రానిక్స్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

  • మ‌రోవైపు భారత్‌లో మొబైల్‌ తయారీని ప్రోత్సహించేందుకు కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని భారీగా పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం ల‌క్ష్యంగా రూ.62,500 కోట్లతో మొబైల్‌ పీఎల్‌ఐ పథకం 2.0కు ఆమోదం తెలిపింది. ఈ పథకం 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.
  • ఎరువుల రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి దేశంగా మార్చేందుకు, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 'నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ ఫర్ యూరియా-2026' కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచి రైతులకు కొరత లేకుండా చేయనున్నారు. దేశంలో కొత్తగా సహజ వాయువు ఆధారిత (Gas-based) యూరియా తయారీ యూనిట్లను నిర్మించడానికి ఈ విధానం ప్రోత్సాహిస్తుంది. గతంలో ఉన్న 'న్యూ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ (NIP)-2012' తో పోలిస్తే.. ప్రస్తుత NIPU-2026 కింద ఏర్పాటు చేసే ప్రతి కొత్త ప్లాంట్‌పై రూ. 250 కోట్లకు పైగా నిధులు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
  • రూ.10,998 కోట్ల వ్యయంతో వరుణా నది వెంబడి 6/4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు, రూ.14,448 కోట్ల వ్యయంతో గంగా నది వెంబడి 6 లేన్ల అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • భారతీయ రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, సరకు రవాణాను సులభతరం చేయడానికి కేంద్ర మంత్రివర్గం రూ. 3,907 కోట్లతో రెండు భారీ రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద రూ. 2,542 కోట్ల అంచనా వ్యయంతో పారాదీప్-హరిదాస్‌పూర్ రైల్వే లైన్ డబ్లింగ్ (రెండో లైన్) పనులు చేపడతారు. రూ. 1,365 కోట్ల పెట్టుబడితో డాంగోవాపోసి-రాజ్‌ఖర్సవాన్ మార్గంలో నాలుగో రైల్వే లైన్ నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.

Also Read..

దివిటిపల్లి ప్లాంట్‌లో 400 మంది మహిళలే : గల్లా అరుణ కుమారి వల్లనే నేను గెలిచా

రియల్‌మీ నార్జో 100ఎక్స్ 5జి లాంచ్.. 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో గేమర్లకు కొత్త ఆప్షన్..

తెలంగాణ‌లో స‌ర్ గ‌డువు పొడిగింపు.. ఆగ‌స్టు 3 వ‌ర‌కు బీఎల్‌వో ఇంటికొస్తారు

Advertisement
Advertisement