త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | తెలంగాణ‌లో స‌ర్ గ‌డువు పొడిగింపు.. ఆగ‌స్టు 3 వ‌ర‌కు బీఎల్‌వో ఇంటికొస్తారు

SIR | ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో స‌ర్( SIR ) గ‌డువు పొడిగించారు. ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు బీఎల్‌వోలు ప్ర‌తి ఇంటికి వ‌చ్చి ఓట‌ర్ల వివ‌రాల‌ను సేక‌రించి, న‌మోదు చేయ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On Jul 15, 2026, 5.08 pm IST

SIR | తెలంగాణ‌లో స‌ర్ గ‌డువు పొడిగింపు.. ఆగ‌స్టు 3 వ‌ర‌కు బీఎల్‌వో ఇంటికొస్తారు
Advertisement

SIR | త్రినేత్ర‌.న్యూస్ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో స‌ర్( SIR ) గ‌డువు పొడిగించారు. ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు బీఎల్‌వోలు ప్ర‌తి ఇంటికి వ‌చ్చి ఓట‌ర్ల వివ‌రాల‌ను సేక‌రించి, న‌మోదు చేయ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆగ‌స్టు 10న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుద‌ల చేయ‌నున్నారు. ఆగ‌స్టు 10 నుంచి సెప్టెంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌నున్నారు. అక్టోబ‌ర్ 12న తుది జాబితాను వెల్ల‌డించ‌నున్నారు.

అయితే స‌ర్ గ‌డువు పొడిగించాల‌ని అధికార పార్టీ కాంగ్రెస్‌తో స‌హా ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి విజ్ఞ‌ప్తులు చేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి ఆయా పార్టీల విజ్ఞ‌ప్తులు, ఓట‌ర్ల ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. తెలంగాణ‌లో స‌ర్ గ‌డువును పొడిగించింది.

Advertisement
Advertisement