త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహ‌నాల రిజిస్ట్రేష‌న్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్

Telangana | తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖలో వాహనాల‌ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రతి ర‌వాణా కార్యాలయంలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు కుప్పలుతెప్ప‌లుగా ప‌డి ఉన్నాయి.

S

Telangana | Published On Jul 15, 2026, 5.04 pm IST

Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహ‌నాల రిజిస్ట్రేష‌న్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖలో వాహనాల‌ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రతి ర‌వాణా కార్యాలయంలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు కుప్పలుతెప్ప‌లుగా ప‌డి ఉన్నాయి. గ‌త మూడు నెల‌లుగా డిస్పాచ్ ప్ర‌క్రియ నిలిచిపోయింది. దీంతో వాహ‌నాల య‌జ‌మానులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు ట్రాఫిక్ పోలీసుల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు.

రిజిస్ట్రేషన్ కార్డులు లేక ట్రాఫిక్ పోలీసులుతో ఇక్కట్లు ఏర్ప‌డుతున్నాయి. మొత్తంగా తలనొప్పిగా మారింది వ్య‌వ‌హారం. సరియైన సౌకర్యాలు లేక వాహన రిజిస్ట్రేషన్ కార్డులు, లైసెన్స్‌లు పంపించలేక పోతున్నామ‌ని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ర‌వాణా శాఖ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ కార్డుల కోసం వాహ‌న‌దారులు తిరుగుతున్నారు. వాహనదారులకు సమాధానం చెప్పలేక సంబంధిత ర‌వాణా శాఖ అధికారులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

Advertisement
Advertisement