త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

22A Lands Issue Telangana | 22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ‘ఫ్రీ లీగల్ సెల్’ : ఫోన్ నెంబర్ ఇదే!

22A భూముల పేరుతో ఇబ్బంది పడుతున్న బాధితులకు హరీశ్ రావు అభయం ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో ఉచిత లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫోన్ నెంబర్ ఇదే.

J

Telangana | Published On Aug 19, 2026, 4.23 pm IST

22A Lands Issue Telangana | 22A భూముల బాధితులకు అభయం.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ‘ఫ్రీ లీగల్ సెల్’ : ఫోన్ నెంబర్ ఇదే!
Advertisement
  • 22A భూముల బాధితుల కోసం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఉచిత లీగల్ సెల్ (Legal Cell) ఏర్పాటు
  • కమీషన్లు, సెటిల్మెంట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్ భూములను 22A లో పెట్టిందని హరీశ్ రావు ఫైర్
  • లక్షలాది మందిని రోడ్డున పడేసిన మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్
  • బాధితులు న్యాయ సాయం కోసం అడ్వకేట్ కళ్యాణ్ (812535604)ను సంప్రదించాలని సూచన

22A Lands Issue Telangana | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా '22A' (నిషేధిత భూముల జాబితా) పద్మవ్యూహంలో చిక్కుకుని.. ఆస్తులు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది బాధితులకు బీఆర్ఎస్ (BRS) పార్టీ పెద్ద ఊరటనిచ్చింది. బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేసేందుకు తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా ఉచిత 'లీగల్ సెల్'ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత తన్నీరు హరీశ్ రావు బాధితులతో స్వయంగా సమావేశమై ఈ సంచలన ప్రకటన చేశారు.

BRS Sets Up Free Legal Cell for 22-A Land Victims in Telangana says Harish Rao

ఫ్రీ లీగల్ సెల్.. ఫోన్ నెంబర్ ఇదే

22A పేరుతో ఆస్తులు బ్లాక్ లిస్ట్‌లో పడ్డాయని ఎవరూ భయపడొద్దని, ఆగం కావొద్దని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. కమీషన్లకు భయపడి తక్కువ ధరకు ఆస్తులు అమ్ముకోవద్దని సూచించారు. సామాన్యుల ఆస్తులను కాపాడేందుకు 10 మంది అడ్వకేట్లతో కూడిన ఉచిత లీగల్ సెల్‌ను తెలంగాణ భవన్‌లో స్టార్ట్ చేశామన్నారు. న్యాయ సహాయం కావాల్సిన బాధితులు అడ్వకేట్ కళ్యాణ్ (ఫోన్: 812535604) కు కాల్ చేసి ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చని వెల్లడించారు. లీగల్ సపోర్ట్‌తో పాటు ఎమ్మెల్యేలుగా తాము కూడా కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు సాల్వ్ చేస్తామన్నారు.

BRS Sets Up Free Legal Cell for 22-A Land Victims in Telangana says Harish Rao

ఆ 30% కమీషన్ల కోసమే ఈ దందా..

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు రియల్ ఎస్టేట్ (Real estate) వ్యాపారాలు బాగా తెలుసని.. అందుకే ప్రైవేట్ భూములను 22A లో పెట్టి 30 శాతం కమీషన్లు, 50-50 సెటిల్మెంట్లకు తెరలేపారని ఆరోపించారు. 30 ఏళ్ల క్రితం HUDA, HMDA పర్మిషన్‌తో కొనుక్కున్న ఇళ్లను కూడా ఇప్పుడు ఈ లిస్ట్‌లో పెట్టి సామాన్యులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. బుద్వేల్, శేరిలింగంపల్లి (SAS Infra), అమీన్‌పూర్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల దందా జరిగిందని ఆయన కుండబద్దలు కొట్టారు.

BRS Sets Up Free Legal Cell for 22-A Land Victims in Telangana says Harish Rao

సీఎం ఇంటిని ముట్టడిస్తాం.. మంత్రిని బర్తరఫ్ చేయాలి

ఒకవైపు యాదాద్రిలో 40 వేల ఎకరాలు 22Aలో పడ్డాయని సాక్షాత్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే ముఖ్యమంత్రికి చెప్పినా.. రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. చిన్న చిన్న విషయాలకే విచారణలు వేసే ప్రభుత్వం.. ఈ భారీ కుంభకోణంపై సీఐడీ (CID) ఎంక్వైరీ ఎందుకు వేయడం లేదన్నారు. సీఎంకు ఇందులో సంబంధం లేకపోతే వెంటనే మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ (Dismiss) చేయాలని డిమాండ్ చేశారు.

BRS Sets Up Free Legal Cell for 22-A Land Victims in Telangana says Harish Rao

ఒకటి రెండు రోజులు చూస్తామని.. ప్రభుత్వం వెంటనే ఆన్‌లైన్ నుంచి 22A ఆంక్షలు తొలగించకపోతే, బాధితులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం ఇంటిని ముట్టడిస్తామని హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

BRS Sets Up Free Legal Cell for 22-A Land Victims in Telangana says Harish Rao

Advertisement
Advertisement