త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha Name Change | కవిత.. పేరు మార్చుకోవాల్సిందే..!

రాజకీయాల్లో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు జయలలిత తరహాలోనే తన పేరును మార్చుకోవాలని కవితకు ప్రముఖ జ్యోతిష్యుడు వెట్రివేల్ కీలక సూచనలు చేశారు.

J

Telangana | Published On Aug 19, 2026, 4.42 pm IST

Kavitha Name Change | కవిత.. పేరు మార్చుకోవాల్సిందే..!

సంక్షిప్త సారాంశం

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత తన పొలిటికల్ ఫ్యూచర్‌పై కవిత ఫోకస్ పెట్టారు. జయలలిత, విజయ్ లాంటి ప్రముఖులకు జాతకం చెప్పిన వెట్రివేల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 'కల్వకుంట్ల' ఇంటి పేరును పక్కనపెట్టి కేవలం 'Kavitha' లేదా 'Kavitha D' గా మార్చుకోవాలని ఆస్ట్రాలజర్ సూచించారు. రాహువు అనుకూలంగా లేకపోవడం వల్లే రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని వెల్లడించారు.

Advertisement
  • జయలలిత లాగా.. పేరులో మార్పులు అవసరం..
  • అప్పుడే రాజకీయ భవిష్యత్తు
  • జ్యోతిష్యుడు వెట్రివేల్ సూచన
  • ఇంకా కొనసాగుతున్న భేటీ
  • మరి కాసేపట్లో మరిన్ని వివరాలు

Kavitha Name Change | త్రినేత్ర.న్యూస్ : "నాడు తమిళనాడు సీఎం జయలలిత పేరులో అక్షరాలు మార్చిన తర్వాతే ఆమె సీఎం అయ్యారు. ఆమె పేరులో J Jayalalitha" కు బదులుగా "J Jayalalithaa అని ఒక a అదనంగా జోడించిన తర్వాత ఆమె రాజకీయాల్లో వెను తిరిగి చూసుకోలేదు. అలాగే మీ పేరును స్టడీ చేసిన తర్వాత.. మీ పేరులో మార్పులు అవసరం. నాలుగైదు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీరు రాస్తున్న కల్వకుంట్ల కవిత అని కాకుండా.. కవిత అని మాత్రమే రాయండి. మీ భర్తగారి ఇంటి పేరుతో మీకేమైనా కలిసొస్తుందా కూడా చూద్దాం. కాబట్టి మీకు ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి Kavitha అని రాయడం. రెండు.. Kavitha D తో ముందుకు వెళ్లడం" ...ఇది విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు .. తెలంగాణ రక్షణ సమితి చీఫ్ కవితకు చేసిన సూచనలు. అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం.. కవితకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉండబోతున్నదని చెప్పినట్లుగా తెలిసింది. ప్రముఖ తమిళనాడు జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ తో కవిత.. బుధవారం (2026 ఆగస్టు 19) సమావేశమైన సంగతి తెలిసిందే. తన రాజకీయ భవిష్యత్తు, పురోగతికి అవసరమైన ఆధ్యాత్మిక చర్యల గురించి చాలా సేపు చర్చ జరిగినట్టు సమాచారం. అయితే భేటీ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది..

కల్వకుంట్లనా? దేవనపల్లి నా? అసలేదీ వద్దా..

బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత కవిత తన ఇంటి పేరు మార్చుకునే విషయమై ముఖ్యమైన అనుచరులతో ఇప్పటికే చాలా సార్లు చర్చించింది. అయితే.. రాజకీయ శ్రేయస్సును అనుసరించి.. కల్వకుంట్ల అనే పేరును వదులుకుంటే ఎలా ఉంటుందో.. జ్యోతిష్యుడు వేట్రివేల్ తో కూడా చర్చిస్తున్నారు. పేరులో అక్షరాలు మార్చుకోవడం ద్వారా ఢిల్లీలో పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ఉదాహరణలను కవితకు.. వేట్రివేల్ వివరించారు. ఆమె కుండలిలో రాజకీయ ఉన్నతిని నిర్దేశించే దశమ స్థానం బలంగా ఉన్నప్పటికీ.. భాగ్య స్థానం (9వ స్థానం)లో అనేక దోషాలు ఉన్నట్లు వేట్రివేల్ ఆమెకు వివరించినట్టు తెలిసింది. ఆమె జాతకంలో కుజుడు, సూర్యుడు, శని బలంగా ఉన్నప్పటికీ.. రాహువు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ రెండేళ్లలో అనుకున్న స్థాయిలో దూసుకెళ్లేందుకు విపరీతంగా శ్రమించాలని.. ఆయన చెప్పినట్లు సమాచారం

ఎవరీ వేట్రివేల్

తమిళనాడులోని ఎరోడ్ లో జన్మించిన వెట్రివేల్ వైదిక జ్యోతిష్యుడు. ఆధ్యాత్మిక వేత్త. ప్రముఖులైన రాజకీయ నాయకులకు..పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో జయలలిత గెలుస్తుందని 1991లో జోస్యం చెప్పారు. అప్పటి నుంచి ఆయన జయలలితకు అడపాదడపా సూచనలు చేస్తూ ఉండేవారు. 1996లో ఆమె అరెస్టయి..విడుదలైన తర్వాత ఆమె పేరులో అదనంగా ఒక a జోడించాలని వేట్రివేల్ చేసిన సూచనను ఆమె పాటించి.. ఆ తర్వాత సీఎం అయ్యారు. 1996 నుంచి 98 మధ్య ఆయన ముంబైలో ఆయన పేరు మార్మోగింది. కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, నటి మనీషా కొయిరాలా వంటి ప్రముఖులకు ఆయన తగు సూచనలు చేసేవారు. 2008లో ఆయన తన పేరును రాధన్ పండిట్ గా మార్చుకొని ఢిల్లీకి మకాం మార్చారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలకు వ్యక్తిగత జ్యోతిష్యుడిగా మారారు. 2024లో తిరిగి ఢిల్లీ నుంచి ఆయన తమిళనాడుకు చేరుకున్నారు. అప్పుడే.. సినీ హీరో విజయ్.. తమిళనాట తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతాడని జోస్యం చెప్పారు.

Advertisement
Advertisement