త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Photo Journalists | ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటండి.. ప్ర‌కృతి అందాల‌ను ఫొటోల్లో బంధించండి

Photo Journalists | ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి.. ప్ర‌కృతి అందాల‌ను ఫొటోల్లో బంధించాల‌ని తెలంగాణ ఫొటో జ‌ర్న‌లిస్టులు పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Aug 19, 2026, 4.43 pm IST

Photo Journalists | ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటండి.. ప్ర‌కృతి అందాల‌ను ఫొటోల్లో బంధించండి
Advertisement
  • ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా ఫొటో జ‌ర్న‌లిస్టుల పిలుపు
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కుడు జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్ స్ఫూర్తితో వెంగ‌ళ‌రావున‌గ‌ర్ పార్క్‌లో మొక్కలు నాటిన జ‌ర్న‌లిస్టులు

Photo Journalists | త్రినేత్ర‌.న్యూస్: ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి.. ప్ర‌కృతి అందాల‌ను ఫొటోల్లో బంధించాల‌ని తెలంగాణ ఫొటో జ‌ర్న‌లిస్టులు పిలుపునిచ్చారు. బుధ‌వారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీ భాస్కర్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైద‌రాబాద్‌లోని వెంగళరావు నగర్ పార్క్‌లో వారు మొక్కలు నాటారు.

సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు..

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. ఆహ్లాద‌క‌ర‌ వాతావరణం ఉంటేనే సకల జీవ రాషుల మనుగడ బాగుంటుంద‌ని చెప్పారు. ప్రకృతి బాగుంటేనే ప్ర‌జ‌లు బాగుంటార‌ని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం గొప్ప విష‌య‌మ‌ని ఫొటో జ‌ర్న‌లిస్టులు కొనియాడారు. అందరిని ఏకం చేసి కోట్లాది మొక్కలు నాటడం గ‌ర్వించ‌ద‌గిన విష‌య‌మ‌న్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఠాకూర్, సర్వేశ్వర్ రెడ్డి, పరమేశ్ గౌడ్, వినయ్ మడపు, చిన్న యాదగిరి గౌడ్, కృష్ణ, సూర్య శ్రీధర్, ముజీబ్, షేక్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement