Bus overturns | డబుల్ డెక్కర్ బస్సు బోల్తా.. ఆరుగురు ప్రయాణికులు మృతి
Bus overturns | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఉన్నావ్ (Unnao) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే (Lucknow-Agra Expressway)పై డబుల్ డెక్కర్ ఏసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
Bus overturns | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ (Unnao) జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే (Lucknow-Agra Expressway)పై డబుల్ డెక్కర్ ఏసీ బస్సు (double-decker AC bus) అదుపుతప్పి బోల్తా పడింది (Bus overturns). ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున 5:15 గంటల సమయంలో నిభా ఖేడా గ్రామం వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 21 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?






