Jagadeesh Reddy | యూపీలో మీటర్లు వద్దన్నది మీరే.. మరి తెలంగాణలో ఎట్ల పెడుతరు?: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
Jagadeesh Reddy | ఉత్తరప్రదేశ్ లో RDSS పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేసి, తెలంగాణలో అదే పథకానికి అనుకూలంగా ఉండడం ఏంటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే బతుకులు చీకటి అవుతాయని కేసీఆర్ ముందునుంచే చప్తూ వచ్చారని గుర్తు చేశారు.
- శ్రీకాకుళంలో RDSS పథకం అమలు చేసి వెనక్కి తీసుకున్నారు
- RDSSను కేసీఆర్ మొదటి నుంచే వ్యతిరేకించారు
- తెలంగాణలో ప్రతి ఇంట్లో మీటర్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది
- విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు రేవంత్ కుట్ర
- మీటర్లు పెడితే మరో ఉద్యమం తప్పదు
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరిక
Jagadeesh Reddy | త్రినేత్ర.న్యూస్: ఉత్తరప్రదేశ్ లో RDSS పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేసి, తెలంగాణలో అదే పథకానికి అనుకూలంగా ఉండడం ఏంటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో RDSS పథకాన్ని శ్రీకాకుళంలో పెట్టి మళ్లీ వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో RDSS పథకం ద్వారా ప్రతి ఒక్కరి ఇంట్లో మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. కాంగ్రెస్ వస్తే బతుకులు చీకటి అవుతాయని కేసీఆర్ ముందునుంచే చప్తూ వచ్చారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా, ప్రాంతీయ పార్టీనా? కాంగ్రెస్ వస్తే బతుకులు చీకటి అవుతాయని కేసీఆర్ ముందు నుంచి చెప్తూనే వచ్చారు. కాంగ్రెస్ పార్టీని తొందర్లోనే బంగాళాఖాతంలో వెయ్యడం ఖాయం. RDSSకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది.
రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది..
తెలంగాణ రాష్ట్రంలో తొందరలోనే చీకటి అలుముకుంటుంది. రైతుల పాలిటనే కాదు ఉచిత విద్యుత్ పొందుతున్న వారందరిపై పిడుగు పడబోతోంది. RDSS విధానాన్ని మొదటి నుంచి కేసీఆర్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్ లో RDSS పథకం కింద మీటర్లు పెట్టారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మహిళలు వేలాదిగా రోడ్డు పైకి వచ్చి మీటర్లను తగలబెట్టారు. తెలంగాణలో ఈ పథకం ద్వారా ప్రతిఒక్కరి ఇంట్లో మీటర్లు పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైంది. RDSS మీటర్ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతది. RDSS మీటర్ కు ముందే రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది.. లేకపోతే కరెంట్ కట్ అవుతుంది అని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
రూరల్ డిస్కంలను అదానీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది..
RDSS ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్సంటేజ్ లతో మీటర్ ఖర్చు ఎంతకు పోతుందో తెలియదు. ఈ ప్రభుత్వం కొత్తగా రూరల్ డిస్కం తెచ్చే ఆలోచన చేస్తుంది. రూరల్ డిస్కంను అదానీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు..
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు




