త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bus Accident | లోయ‌లో ప‌డిపోయిన బ‌స్సు.. తొమ్మిది మంది మృతి

Bus Accident | హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సిర్మా జిల్లా హ‌రిపుర్‌ధార్‌లో ఘోర బ‌స్ ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సులోయ‌లో ప‌డి తొమ్మిది మంది ప్ర‌యాణికులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. స‌మాచారం అందుకున్న అధికారులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

P

National | Published On Jan 9, 2026, 5.26 pm IST

Bus Accident | లోయ‌లో ప‌డిపోయిన బ‌స్సు.. తొమ్మిది మంది మృతి
Advertisement

Bus Accident | హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సిర్మా జిల్లా హ‌రిపుర్‌ధార్‌లో ఘోర బ‌స్ ప్ర‌మాదం జ‌రిగింది. బ‌స్సులోయ‌లో ప‌డి తొమ్మిది మంది ప్ర‌యాణికులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. స‌మాచారం అందుకున్న అధికారులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుప్వి నుంచి సిమ్లాకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్‌కు చెందిన బ‌స్సు హ‌రిపుర్‌ధార్ స‌మీపంలోని లోయ‌లో ప‌డిపోయింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 30 నుంచి 35 మంది ప్ర‌యాణీకులు ఉన్నారు. స్థానికులు వేగంగా స్పందించిన ప‌లువురిని ర‌క్షించి రోడ్డుపైకి తీసుకువ‌చ్చారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో క్ష‌త‌గాత్రుల రోధ‌న‌లు, హాహాకారాలు మిన్నంటాయి. ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది.

సిర్మి జిల్లా ఎస్పీ నిశ్చింత్ సింగ్ నేని మాట్లాడుతూ.. హరిపుర్‌ధార్ సమీపంలో కుప్వి నుండి సిమ్లాకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రహదారిపై లోయ‌లో ప‌డిపోయింద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది చ‌నిపోయార‌న్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. పోలీసుల‌తో పాటు స‌హాయ‌క బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి ప్ర‌యాణీకుల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌న్నారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో ఇంకా రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంద‌న్నారు. ప్ర‌మాదానికి కార‌ణాలు తెలియ‌లేద‌న్నారు. రోడ్డు ప్ర‌మాదంపై మ‌హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు స‌హాయం అందించాల‌ని, గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన వైద్య స‌హాయం అందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement