త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Noida Techie Drown Case | నోయిడా టెకీ మృతి కేసు.. నిర్మాణ సంస్థ ఓనర్ అరెస్ట్

ఈ ఘటన జరగడానికి 10 రోజుల ముందే ఓ ట్రక్ కూడా ఇలాగే అదుపు తప్పి నీటి గుంతలో పడబోయింది. డ్రైవర్ అప్రమత్తమై ప్రహారికి ఢీకొట్టి ట్రక్కును అదుపు చేశాడు. లేకపోతే ఆ ట్రక్కు కూడా నీటి గుంతలో పడి ఉండేది.

J

National | Published On Jan 20, 2026, 7.21 pm IST

Noida Techie Drown Case | నోయిడా టెకీ మృతి కేసు.. నిర్మాణ సంస్థ ఓనర్ అరెస్ట్
Advertisement

Noida Techie Drown Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా టెకీ మృతి కేసుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నోయిడా అథారిటీ సీఈవో లోకేష్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆ ప్లేస్‌లో మాల్ నిర్మాణం కోసం పెద్ద గుంతను తవ్వింది. ఆ గుంతలోకి నీళ్లు వచ్చి చేరాయి. సరిగ్గా అక్కడే రోడ్డు మూలమలుపు ఉండటం, ఎలాంటి సైన్ బోర్డులు, రిఫ్లెక్టర్లు, బ్యారికేడ్లు లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని గుర్తించిన అధికారులు వెంటనే ఆ నిర్మాణ సంస్థ యజమానులపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అక్కడ కన్‌స్ట్రక్షన్ కంపెనీ విష్‌టౌన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం చేపడుతోంది. దాని ఓనర్ అభయ్ కుమార్‌ని నోయిడా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ఓనర్ మనీష్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. మూడు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం గుంతలో చిక్కుకుపోయిన కారును రెస్క్యూ టీమ్ వెలికితీసింది. కారు అదుపుతప్పి ప్రహారికి ఢీకొని నీటి గుంతలో పడగానే కారు సన్‌రూఫ్ ఓపెన్ చేసుకున్న యువరాజ్ కారు మీదికి చేరుకొని అక్కడి నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ.. చుట్టుపక్కన ఎవ్వరూ లేకపోవడంతో వెంటనే తన తండ్రికి ఫోన్ చేశాడు. వెంటనే రెస్క్యూ టీమ్‌కి కాల్ చేసి అక్కడికి తండ్రి రప్పించాడు. కానీ.. కారు వద్దకు వెళ్లేందుకు కావాల్సిన తాడు, ఇతర పరికరాలు లేక సిబ్బంది సహాయ చర్యలను ప్రారంభించలేకపోయారు. దీంతో కారుతో పాటు నీటిలో మునిగి యువరాజ్ మృతి చెందాడు. ఈత రాకపోవడం వల్ల యువరాజ్ 90 నిమిషాల పాటు కారు మీద నిలబడి సహాయం కోసం ఎదురు చూశాడు. ఒకవేళ ఈత వచ్చి ఉంటే యువరాజ్ బతికి ఉండేవాడని రెస్క్యూ టీమ్, స్థానికులు తెలిపారు.

ఈ ఘటన జరగడానికి 10 రోజుల ముందే ఓ ట్రక్ కూడా ఇలాగే అదుపు తప్పి నీటి గుంతలో పడబోయింది. డ్రైవర్ అప్రమత్తమై ప్రహారికి ఢీకొట్టి ట్రక్కును అదుపు చేశాడు. లేకపోతే ఆ ట్రక్కు కూడా నీటి గుంతలో పడి ఉండేది.

Advertisement

తాజావార్తలు

Advertisement