త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budget 2026 | రైల్వే టికెట్లపై రాయితీ ఇచ్చేనా..? కేంద్ర బడ్జెట్‌పై సీనియర్‌ సిటిజన్ల ఆశలు..!

Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై సీనియర్ సిటిజన్లకు భారీ అంచనాలున్నాయి. భారతీయ రైల్వేలు ఇటీవల రైలు ఛార్జీలను పెంచాయి. దాంతో సీనియర్‌ సిటిజన్లు ప్రయాణం మరింత ఖరీదైంది. కోవిడ్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయి.

P

National | Published On Jan 11, 2026, 11.35 am IST

Budget 2026 | రైల్వే టికెట్లపై రాయితీ ఇచ్చేనా..? కేంద్ర బడ్జెట్‌పై సీనియర్‌ సిటిజన్ల ఆశలు..!
Advertisement

Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై సీనియర్ సిటిజన్లకు భారీ అంచనాలున్నాయి. భారతీయ రైల్వేలు ఇటీవల రైలు ఛార్జీలను పెంచాయి. దాంతో సీనియర్‌ సిటిజన్లు ప్రయాణం మరింత ఖరీదైంది. కోవిడ్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయి. అయితే, సీనియర్‌ సిటిజన్లకు ఇంకా టికెట్లపై రాయితీని మాత్రం పునరుద్ధరించలేదు. కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో తొలగించారు. ఇప్పటి వరకు తిరిగి రాయితీని పునరుద్ధరించలేదు.

215 కిలోమీటర్లకు పైబడి ప్రయాణాలకు ఛార్జీలను పెంచాలని రైల్వే నిర్ణయించింది. జనరల్ కేటగిరీలో కిలోమీటరుకు అదనంగా ఒక్కోపైసా, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని నాన్‌ ఏసీ, ఏసీ కేటగిరిల్లో కిలోమీటర్‌కు 2 పైసలు వసూలు చేస్తున్నది. దాంతో రూ.600 కోట్లకుపైగా అదనపు ఆదాయం వస్తుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. అయితే, ప్రయాణీకులపై ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. గతంలో కొవిడ్‌కు ముందు రైల్వేలు సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై గణనీయమైన రాయితీలు ఇచ్చేవి. 2019 వరకు 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులకు 40శాతం రాయితీ, 58 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు 50శాతం రాయితీని రైల్వే ఇచ్చేది. ఈ రాయితీ మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది, దురందో తదితర రైళ్లకు సైతం వర్తించేది. ఉదాహరణకు రాజధాని రైలులో ఫస్ట్ ఏసీ టిక్కెట్ ధర రూ.4వేలు అయితే.. సీనియర్ సిటిజన్లకు అదే టికెట్‌ రూ.2వేల నుంచి రూ.2300 వరకు లభించేది. అప్పట్లో సుదూర ప్రయాణం సైతం సరసమైందిగా ఉండేది.

2020లో కరోనా సమయంలో ప్రభుత్వం సీనియర్‌ సిటిజన్లకు రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో ప్రయాణీకుల రద్దీ చాలా తక్కువగా ఉందని, రైల్వేల ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో ఉందంటూ సాకుగా చూపింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మళ్లీ రైల్వేలు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రైల్వే ఆదాయం సైతం భారీగానే పెరిగింది. అయినా రైల్వేశాఖ రాయితీని మాత్రం పునరుద్ధరించలేదు. దాంతో సీనియర్‌ సిటిజన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పదవీ విరమణ తర్వాత ఆదాయం పరిమితంగా ఉంటుందని సీనియర్‌ సిటిజన్లు పేర్కొంటున్నారు. చాలా మంది పెన్షన్లు, పొదుపుపైనే ఆధారపడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. పలు అవసరాల నిమిత్తం తరుచుగా ప్రయాణం చేయాల్సి వస్తుందని. ఈ క్రమంలో చార్జీలు పెరుగుతుండడంతో భారం పడుతుందని పేర్కొంటున్నారు. టికెట్లపై రాయితీని పునరుద్ధరిస్తే ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సారైనా కేంద్రం బడ్జెట్‌ ఊరట కల్పిస్తుందనే ఆశతో ఉన్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీర్ఘకాలిక డిమాండ్‌పై ఈ సారైనా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు. రాయితీని తిరిగి ప్రకటిస్తే లక్షలాది మంది సీనియర్‌ సిటిజన్లకు ప్రయోజనం కలుగనున్నది.

Advertisement

తాజావార్తలు

Advertisement