త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PoK | పీవోకే మొత్తాన్ని క‌శ్మీర్‌లో విలీనం చేయాలి : బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మ‌న్

PoK | బ్రిటీష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మ‌న్ క‌శ్మీర్ అంశంలో మ‌రోసారి భార‌త్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పీవోకే మొత్తాన్ని భార‌త్‌లో విలీనం చేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలోని ప‌లుచోట్ల పాకిస్తాన్ కొనసాగిస్తున్న నియంత్రణను విమర్శించారు.

A

National | Published On Jan 5, 2026, 4.59 pm IST

PoK | పీవోకే మొత్తాన్ని క‌శ్మీర్‌లో విలీనం చేయాలి : బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మ‌న్
Advertisement

PoK | బ్రిటీష్ ఎంపీ బాబ్ బ్లాక్‌మ‌న్ క‌శ్మీర్ అంశంలో మ‌రోసారి భార‌త్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పీవోకే మొత్తాన్ని భార‌త్‌లో విలీనం చేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలోని ప‌లుచోట్ల పాకిస్తాన్ కొనసాగిస్తున్న నియంత్రణను తీవ్రంగా విమర్శించారు. జైపూర్‌లోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో జరిగిన హై టీ కార్యక్రమంలో మాట్లాడుతూ బాబ్ బ్లాక్‌మ‌న్ మాట్లాడారు. కశ్మీర్‌ను పాక్‌ ఆక్రమించడాన్ని గ‌తంలో తాను వ్య‌తిరేకించాన‌న్న ఆయ‌న‌.. ఎప్ప‌టికీ వ్య‌తిరేకిస్తుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దును 2019లో కాకుండా.. 1990ల్లో కశ్మీరీ పండితుల వలసల కన్నా ముందే చేపట్టాల్సింది అంటూ క‌న్జ‌ర్వేటివ్ ఎంపీ త‌న అభిప్రాయప‌డ్డారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆర్టికల్ 370 రద్దును తమ మేనిఫెస్టోలో చేర్చి, అమలు చేసిన స‌మ‌యంలోనే తాను పీవోకేను విలీనం చేయాల‌ని పిలుపునివ్వ‌లేద‌ని.. క‌శ్మీరీ పండితులను జమ్మూ క‌శ్మీర్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టినప్పుడు.. అంటే 1992లోనే తాను పిలుపునిచ్చాన‌ని బ్లాక్‌మ‌న్ తెలిపారు. అక్రమంగా ఆక్రమించడమే కాకుండా.. పీవోకేలో పాక్ ఉగ్రవాదాన్ని విస్తరిస్తుండం స‌రైంది కాద‌న్నారు. మొత్తం జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో విలీనం చేసుకోవాలని తాను అనేకసార్లు సూచించినట్లు చెప్పారు. గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని సైతం బ్రిటీష్ ఎంపీ తీవ్రంగా ఖండించారు. కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండడంతో అక్కడ శాంతి నెలకొందని తాను భావించానన్నారు. పహల్గాం దాడితో ఉగ్ర సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చిందన్నారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని విస్తరిస్తే ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉంద‌ని ఆయ‌న పాకిస్తాన్‌ను హెచ్చ‌రించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement