త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LK Advani | ఛాతీలో ఇన్ఫెక్ష‌న్‌.. ద‌వాఖాన‌లో చేరిన ఎల్‌కే అద్వానీ

LK Advani | బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఉప ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ (LK Advani) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వయోసంబంధిత సమస్యలతో పాటు ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో (Chest Infection) బాధ‌ప‌డుతున్న 98 ఏండ్ల అద్వానీని శుక్ర‌వారం రాత్రి ఢిల్లీలోని అపోలో ద‌వాఖాకు త‌ర‌లించారు.

G

National | Published On Oct 17, 2026, 7.22 am IST

LK Advani | ఛాతీలో ఇన్ఫెక్ష‌న్‌.. ద‌వాఖాన‌లో చేరిన ఎల్‌కే అద్వానీ
Advertisement

LK Advani | త్రినేత్ర న్యూస్‌: బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఉప ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ (LK Advani) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వయోసంబంధిత సమస్యలతో పాటు ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో (Chest Infection) బాధ‌ప‌డుతున్న 98 ఏండ్ల అద్వానీని శుక్ర‌వారం రాత్రి ఢిల్లీలోని అపోలో ద‌వాఖాకు త‌ర‌లించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హాస్పిట‌ల్‌ వర్గాలు వెల్ల‌డించాయి.

సీనియర్ వైద్య నిపుణులు ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న తెలిపారు. రక్త పరీక్షలు, ఈసీజీ, ఎక్స్‌రే తదితర సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించినట్లు సమాచారం. వైద్య చికిత్సలకు ఆయన శరీరం సానుకూలంగా స్పందిస్తోందని, నిలకడగా కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొన్నారు.

గతంలోనూ..

వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యల కారణంగా అద్వానీ మే నెలలో కూడా అపోలో ద‌వాఖాన‌లో చికిత్స పొంది కోలుకున్నారు. ఆ సమయంలో వైద్యులు కొద్దిరోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి, ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జి చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన హాస్పిట‌ల్‌లో చేరారన్న వార్త తెలియడంతో కేంద్ర మంత్రులు, బీజేపీ (BJP) సీనియర్ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అద్వానీ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా, ఇటీవ‌లే ప్ర‌ధాని మోదీ (PM Modi 25 ఏండ్ల ప్ర‌జా సేవ‌ను పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్న విష‌యం తెలిసిందే.

దేశ రాజకీయాల్లో విశిష్ట ప్రస్థానం

1927లో క‌రాచీలో (Karachi) జ‌న్మించిన అద్వానీ భారతదేశ‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ఆయ‌న 2002 నుంచి 2004 వ‌ర‌కు అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) ప్రధానిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా, హోం మంత్రిగా (Home Minister) బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీని జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా నిలబెట్టడంలో ఆయన చేసిన రామరథయాత్ర ఎంతో చారిత్రాత్మకమైనది. దేశానికి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'తో సత్కరించింది.

Advertisement
Advertisement