MP Tejasvi Surya | తెలంగాణ, ఏపీ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో
MP Tejasvi Surya | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగించారు.
MP Tejasvi Surya | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగించారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. దాంతో పాటు తెలంగాణ, ఏపీ విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చారు.
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని తిట్టే క్రమంలో తేజస్వీ సూర్య తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడతీసిన తీరు దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ ను ఎలా అశాస్త్రీయంగా విడదీశారో అలాగే తెలంగాణను కూడా విడదీశారని తేజస్వీ సూర్య పేర్కొన్నారు. ఈ విభజనలో కనీస శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదన్నారు. కాబట్టి బ్రిటిష్ వారు చేసిన దేశ విభజన కంటే కాంగ్రెస్ చేసిన ఏపీ విభజన దారుణంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, భవిష్యత్తును రాష్ట్ర విభజన సందర్బంగా అస్సలు పట్టించుకోలేదని తేజస్వీ సూర్య ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అయితే అప్పట్లో ఈ విభజనకు పార్లమెంట్లో బీజేపీ కూడా మద్దతిచ్చిన విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించకపోవడం విశేషం.
తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు pic.twitter.com/47nkY5a2kS
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



