Konda Surekha | రేవంత్‌లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
Konda Surekha | సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖను మంత్రిగా తొలగించకపోతే నేను సీఎంగా ఉండనని, పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి.. తనను బర్తరఫ్ చేశారని ఆరోపించారు. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ సోదరులు, తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు నాపై వేటు వేసేందుకు అధిష్టానంపై ఒత్తిడి చేశారని తెలిపారు. తెలుగు దేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ తరహా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
నన్ను అన్నవాళ్లకు ఉరుసు తగులుతుంది
టీడీపీలో చేసినట్టే సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేసి.. మైండ్ గేమ్ ఆడుతున్నారు. టీడీపీ రక్తంతో ఉన్న వాళ్లు ఇలాంటివే చేస్తారు. టీడీపీ నుంచి వచ్చిన వారు కావాలనే మానసికంగా ఇబ్బంది పెడుతుంటారు. నాకు పదవులపై వ్యామోహం లేదు. రెండున్నరేళ్లు మంత్రిగా నా పని నేను సమర్థంగా చేశా. నా పేషీకి వచ్చిన ప్రతి పని న్యాయంగా పూర్తి చేశా. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను అన్నవాళ్లకు ఉరుసు తగులుతుంది అని కొండా సురేఖ పేర్కొన్నారు.
రేవంత్ ఫ్యామిలీ విషయం అధిష్టానానికి తెలియదా..?
కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. నేను ఎమ్మెల్యేగా కొనసాగాలా..? వద్దా..? అనే విషయంతో పాటు మిగతా విషయాలన్నీ నేను, నా భర్త మాట్లాడుకున్నాక బయటకు చెబుతాను. రేవంత్ ఫ్యామిలీ విషయం అధిష్టానానికి తెలియదా..? ఏ తప్పు చేయని సుమంత్‌ను అనవసరంగా బద్నాం చేస్తున్నారు. బీసీలను బ్యాలెన్స్ చేస్తున్నామన్నట్లుగా నియామకాలు జరిగాయి. వారికి నా శుభాకాంక్షలు అని కొండా సురేఖ తెలిపారు.
మంత్రిగా చాలా చెప్పుకోలేనివి జరిగాయి
మా కార్యకర్తలకు మేమేంటో తెలుసు. పరకాలలో సీఎం వ్యాఖ్యలే ఈ మొత్తం వివాదానికి కారణం. సీఎం ఎక్కడా అభ్యర్థులను ప్రకటించలేదు. పరకాలలో ఎందుకు ప్రకటించారు. మంత్రిగా చాలా చెప్పుకోలేనివి జరిగాయి. మంత్రిగా చేసిన ప్రమాణానికి కట్టుబడి బయటకు చెప్పలేదు అని కొండా సురేఖ స్పష్టం చేశారు.
క్రమశిక్షణ చర్యలు నాపైనే ఎందుకని...
క్రమశిక్షణ చర్యలు నాపైనే ఎందుకని... కాంగ్రెస్ పార్టీపైన, ప్రభుత్వంపైన కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి పలువురు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సురేఖ ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | అతిథుల వివరాలను అందించండి.. గణేశ్ మండప నిర్వాహకులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 12, 2026

Vakiti Srihari | తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం
సెప్టెంబర్ 12, 2026

CM Revanth reddy | పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్

Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!



