HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పెట్టుబడిదారులకు భారీ షాక్.. రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి..
HDFC Bank | దేశంలో అత్యంత విలువైన ప్రైవేట్ రంగ బ్యాంక్‌గా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. కార్యకలాపాలు, పాలన, యాజమాన్యానికి సంబంధించిన వరుస ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో విస్తృత మార్కెట్‌తో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు గణనీయంగా వెనుకబడ్డాయి.
HDFC Bank | దేశంలో అత్యంత విలువైన ప్రైవేట్ రంగ బ్యాంక్‌గా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. కార్యకలాపాలు, పాలన, యాజమాన్యానికి సంబంధించిన వరుస ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో విస్తృత మార్కెట్‌తో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు గణనీయంగా వెనుకబడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు అంటే వైటీడీ ప్రాతిపదికన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ధర 28 శాతానికి పైగా పడిపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 3.3 శాతం, నిఫ్టీ 50 సూచీ 8.4 శాతం మాత్రమే క్షీణించాయి. ఈ పతనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 2008 తర్వాత తమ అత్యంత దారుణమైన వార్షిక పనితీరును నమోదు చేసే దిశగా సాగుతున్నాయి. ఈ ఏడాది షేర్లలో జరిగిన అమ్మకాల కారణంగా బ్యాంక్ మార్కెట్ విలువ నుంచి రూ.4 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.
మార్చి 18 నుంచి మొదలైంది..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ అటాను చక్రవర్తి గత మార్చి 18న విలువలు, నైతిక అంశాలపై ఉన్న విభేదాలను కారణంగా చూపుతూ రాజీనామా చేశారు. అనంతరం భారతీయ రిజర్వ్ బ్యాంక్ జూలైలో రాజీవ్ కుమార్‌ను బ్యాంక్ కొత్త పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అదనపు వడ్డీ చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరిశీలనను ఎదుర్కొంది. అంతర్గత సమీక్ష అనంతరం ఈ వ్యవహారాన్ని మోసం లేదా వ్యక్తిగత దుష్ప్రవర్తనగా కాకుండా వ్యాపార పరిమితులను అతిక్రమించడంగా బ్యాంక్ వర్గీకరించింది. ఈ వ్యవహారంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ జగదీశన్ సహా ముగ్గురు సీనియర్ అధికారులపై ఆర్థిక జరిమానాలు విధించడంతోపాటు హెచ్చరిక లేఖలు జారీ చేసింది. ఈ వివాదం బ్యాంక్‌పై అమెరికాలో సెక్యూరిటీస్ క్లాస్ యాక్షన్ దావాకు కూడా దారితీసింది.
ఆగస్టు 29న మరింత ముదిరి..
అయితే బ్యాంక్‌పై ప్రస్తుతం ఉన్న అతిపెద్ద ప్రతికూల ప్రభావం ఆగస్టు 29న తెరపైకి వచ్చింది. శశిధర్ జగదీశన్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మరోసారి నియామకం కోరుకోవడం లేదని నిర్ణయించారు. ఆయన పదవీకాలం అక్టోబర్ 26తో ముగియనుంది. దీంతో కొత్త సీఈవో ఎంపిక ప్రక్రియను బోర్డు వేగవంతం చేయనుంది. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరూచా కూడా ఈ అత్యున్నత పదవికి పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో ఒకరై ఉంటారని గతంలో సమాచారం వెలువడింది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సంబంధించిన కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. రుణాలు-డిపాజిట్ల నిష్పత్తి పరంగా బ్యాలెన్స్‌షీట్ నిర్మాణం, అనుకూలంగా లేని అదనపు రుణాల మిశ్రమం కారణంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లపై ఒత్తిడి, ప్రధాన రిటర్న్ ఆన్ అసెట్స్‌పై ప్రభావం, యాజమాన్యం ఇచ్చిన మార్గదర్శకాలు, వాస్తవ అమలుకు మధ్య ఉన్న అంతరం వంటివి ఇందులో ఉన్నాయి.
వృద్ధి అంతంత మాత్రమే..?
2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంక్ స్థూల రుణాలు ఏడాది ప్రాతిపదికన 15.4 శాతం పెరిగి రూ.30.61 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో డిపాజిట్లు 14.7 శాతం పెరిగి రూ.31.71 లక్షల కోట్లకు చేరాయి. అయితే నిర్వహణ లాభం 21.2 శాతం తగ్గి రూ.28,168 కోట్లకు చేరింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 9 బేసిస్ పాయింట్లు తగ్గి 3.35 శాతానికి పడిపోయింది. ఆస్తుల నాణ్యత మాత్రం ఆరోగ్యకరంగానే కొనసాగింది. విలువల పరంగా చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ప్రస్తుతం చారిత్రక సగటుతో పోలిస్తే గణనీయమైన డిస్కౌంట్‌లో ట్రేడవుతోంది. ప్రస్తుతం షేరు ధర-బుక్ విలువ నిష్పత్తి సుమారు 1.78 రెట్లుగా ఉంది. ఐదేళ్ల సగటు 2.90 రెట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఏడాది ఫార్వర్డ్ ధర-బుక్ విలువ నిష్పత్తి సుమారు 1.64 రెట్లుగా ఉంది.
కొనాలా, వేచి చూడాలా..?
అవినాష్‌మెంటర్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, హెడ్ రీసెర్చ్ అవినాష్ గోరక్‌ష్కర్ అభిప్రాయం ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధర ప్రస్తుతం చాలా డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉందని అన్నారు. షేర్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయని, అయితే ఈ సమయంలో ఇన్వెస్టర్లు సొంత నిర్ణయంతో ఈ షేర్లలో పెట్టుబడి పెట్టడం కంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని చెప్పారు. వచ్చే 6 నుంచి 12 నెలల పాటు బ్యాంకుకు కీలకమని, ఇదే సమయం షేర్ ధర దిశను నిర్ణయిస్తుందని, అందువల్ల కొంత కాలం వేచి ఉంటే మంచిదని చెప్పారు. ఇప్పుడే పెట్టుబడి పెడితే తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని అన్నారు. సమస్య బ్యాంక్ సంస్థాగత బలంలో లేదని, పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రధాన అంశమని గోరక్‌ష్కర్ అన్నారు. బోర్డు త్వరలోనే స్పష్టమైన, నిర్ణయాత్మకమైన వారసత్వ ప్రణాళికను ప్రకటిస్తే, ఆదాయాల కంటే ముందుగానే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ వేగంగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా గురువారం సెషన్ ముగిసే సమయానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధర రూ.708.75 వద్ద ఉంది. ఇంట్రా డే లో ఈ షేర్ 1.13 శాతం మేర లాభపడింది.
సంబంధిత వార్తలు

Stock Markets | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 52 వారాల కనిష్టానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్..
ఆగస్టు 27, 2026

Pilot Rohith Reddy | పైలట్ రోహిత్‌రెడ్డికి షాక్.. చెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ఆగస్టు 8, 2026

Minimum Balance | మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఏమిటి.. ఏయే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి..?
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన ఆ ఐదు కీలక కారణాలు! ఇవే
- ●Eatala Rajendar | పేదల ఉసురు పోసుకుంటున్నావ్ రేవంత్
- ●Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ - నాలుగోసారి కాంబో రిపీట్
- ●Supreme Court | లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- ●Redmi 17 5G | రెడ్మీ 17 5జి ఫోన్ వచ్చేసింది.. 7900 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో అదిరిపోయింది..
- ●Ponnam Prabhakar | దమ్ముంటే ఢిల్లీ వెళ్లి మోదీని నిలదీయండి

కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన ఆ ఐదు కీలక కారణాలు! ఇవే

Eatala Rajendar | పేదల ఉసురు పోసుకుంటున్నావ్ రేవంత్

Tamannaah | వెంకటేష్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ - నాలుగోసారి కాంబో రిపీట్

Supreme Court | లా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదు.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు



