Ntr | నాన్‌స్టాప్‌గా షూటింగ్ – చెప్పిన డేట్‌కే థియేటర్లలోకి ఎన్టీఆర్ డ్రాగన్
ఎన్టీఆర్ డ్రాగన్ వాయిదాపడనున్నట్లు వస్తోన్న రూమర్లపై మేకర్స్ రియాక్ట్ అయ్యారు. గాయం నుంచి కోలుకుంటున్న ఎన్టీఆర్ సెప్టెంబర్ మూడో వారం నుంచి డ్రాగన్ షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. జూన్‌లోనే ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు కన్ఫామ్ చేశారు.
Entertainment | Published On Sep 3, 2026, 4.09 pm IST
Ntr | ఎన్టీఆర్ డ్రాగన్ వాయిదా పడనున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవలే డ్రాగన్ షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయపడ్డారు. ఆయన భుజానికి సర్జరీ జరగడంతో దాదాపు రెండు నెలల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. ఈ గాయం ఎఫెక్ట్ డ్రాగన్ షూటింగ్‌పై పడింది. వచ్చే ఏడాది జూన్ 11న ఈ గ్యాంగ్‌స్టర్ మూవీని
ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ గాయం కారణంగా చెప్పిన డేట్‌కు థియేటర్లలోకి రావడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.
ఈ రూమర్లపై నిర్మాతలు రియాక్ట్ అయ్యారు. డ్రాగన్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు.
ఇరుముడి...
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి ఇటీవలే రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో డ్రాగన్ సినిమా పోస్ట్‌పోన్ అంటూ వస్తోన్న వార్తలను నిర్మాతలు ఖండించారు.
నాన్‌స్టాప్‌గా...
సెప్టెంబర్ మూడో వారం నుంచి డ్రాగన్ షూటింగ్ తిరిగి మొదలుకాబోతున్నట్లు ప్రకటించారు. "గాయం నుంచి ఎన్టీఆర్ కోలుకుంటున్నారు. మరో రెండు వారాల్లో తిరిగి షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నాడు. సెప్టెంబర్ మూడో వారం నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుతాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. చెప్పిన డేట్‌కు జూన్‌లో డ్రాగన్ థియేటర్లలోకి రాబోతుంది" అని ప్రకటించారు. నిర్మాతల కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
రుక్మిణి వసంత్...
డ్రాగన్‌లో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కాపూర్, బిజు మీనన్ , గురు సోమసుందరం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
సెప్టెంబర్ 4, 2026

Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ – విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 4, 2026

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా – ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
- ●Tollywood | మందమర్రి నుంచి చంద్రయాన్‌కు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ మూవీ
- ●Rambha Oorvasi Menaka Review | రంభ ఊర్వశి మేనక రివ్యూ - విష్ణుప్రియ, రాశీసింగ్లతో అల్లరి నరేష్ చేసిన సినిమా ఎలా ఉందంటే?

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి

KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు

CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి



