త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bill Gates | ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగ‌.. ఏఐ స‌మ్మిట్‌లో బిల్ గేట్స్ ప్ర‌సంగం ర‌ద్దు

Bill Gates | మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ (Bill Gates)ను అమెరికా ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein) సెక్స్ కుంభ‌కోణం కేసు (Epstein Files) వెంటాడుతోంది.

D

National | Published On Feb 19, 2026, 10.20 am IST

Bill Gates | ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగ‌.. ఏఐ స‌మ్మిట్‌లో బిల్ గేట్స్ ప్ర‌సంగం ర‌ద్దు
Advertisement

Bill Gates | మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ (Bill Gates)ను అమెరికా ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein) సెక్స్ కుంభ‌కోణం కేసు (Epstein Files) వెంటాడుతోంది. ఈ వివాదం కార‌ణంగా ప్ర‌స్తుతం ఢిల్లీలో జ‌రుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026లో ఆయ‌న ఇవ్వాల్సిన కీల‌క ప్ర‌సంగాన్ని చివ‌రి నిమిషంలో ర‌ద్దు చేసుకున్నారు. ఈ విష‌యాన్ని గేట్స్ ఫౌండేష‌న్ (Gates Foundation) అధికారికంగా ప్ర‌క‌టించింది.

షెడ్యూల్ ఫ్ర‌కారం.. ఇవాళ ఉద‌యం 11:30 గంట‌ల‌కు బిల్ గేట్స్ స‌మ్మిట్‌లో ప్ర‌సంగించాల్సి ఉంది. అయితే, ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం నేప‌థ్యంలో స‌మ్మిట్ అస‌లు ఉద్దేశం ప‌క్క‌దారి ప‌ట్ట‌కూడ‌ద‌నే బిల్‌గేట్స్‌ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారని గేట్స్ ఫౌండేషన్ 'ఎక్స్' వేదికగా ప్ర‌క‌టించింది. ఆయ‌న స్థానంలో గేట్స్ ఫౌండేష‌న్‌కు ఆఫ్రికా-ఇండియా విభాగాల ప్రెసిడెంట్‌గా ఉన్న‌ అంకుర్ వోరా ప్రసంగిస్తార‌నిన స్ప‌ష్టం చేసింది. భార‌త్‌లో ఆరోగ్యం, అభివృద్ధి ల‌క్ష్యాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు త‌మ సంస్థ‌ పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంద‌ని ఈ సంద‌ర్భంగా గేట్స్ ఫౌండేష‌న్‌ పేర్కొంది.

ప్ర‌పంచ రాజ‌కీయాల‌ను కుదిపేసిన అమెరికా ఫైనాన్షియ‌ర్ ఎప్‌స్టీన్ జెఫ్రీ సెక్స్ కుంభ‌కోణం ఫైల్స్‌ (Epstein Files)లో బిల్ గేట్స్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తొలుత ఏఐ స‌మ్మిట్‌కు బిల్‌గేట్స్‌కు ఆహ్వానం అంద‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌ను గేట్స్ ఫౌండేష‌న్ రెండు రోజుల క్రిత‌మే కొట్టిపారేసింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్‌కు బిల్ గేట్స్ హాజ‌రవుతార‌ని స్ప‌ష్టం చేసింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ స‌మ్మిట్‌లో బిల్‌గేట్స్ ప్ర‌సంగిస్తార‌ని కూడా గేట్స్ ఫౌండేష‌న్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. అయితే, ప‌రిస్థితుల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన త‌ర్వాత బిల్ గేట్స్ త‌న ప్ర‌సంగాన్ని ర‌ద్దు చేసుకుంటూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించింది.

Advertisement
Advertisement