Bill Gates | ఎప్‌స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్.. ఏఐ సమ్మిట్‌కు బిల్‌గేట్స్‌కు అందని ఆహ్వానం..? క్లారిటీ ఇచ్చిన గేట్స్ ఫౌండేషన్
Bill Gates | దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026)కు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates)కు ఆహ్వానం అందలేదంటూ వార్తలు గుప్పుమన్నాయి.
Bill Gates | దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026)కు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates)కు ఆహ్వానం అందలేదంటూ వార్తలు గుప్పుమన్నాయి. ప్రపంచ రాజకీయాలను కుదిపేసిన అమెరికా ఫైనాన్షియర్ ఎప్‌స్టీన్ జెఫ్రీ సెక్స్ కుంభకోణం ఫైల్స్ (Epstein Files)లో బిల్ గేట్స్ పేరు ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ సమ్మిట్‌కు ఆహ్వానం అందలేదంటూ ప్రచారం జరుగుతోంది. బాధితుల పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఈ వార్తలకు తోడు ప్రస్తుతం ఇండియా టూర్‌లోనే ఉన్న గేట్స్.. ఇప్పటి వరకూ సమ్మిట్‌కు హాజరు కాలేదు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్ గేట్స్ హాజరవుతారని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ సమ్మిట్‌లో బిల్‌గేట్స్ ప్రసంగిస్తారని కూడా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి వెల్లడించారు.
కాగా, అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫైల్స్ (Epstein files)కు సంబంధించిన 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ ఇటీవలే విడుదల చేసింది. ఆ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు బయటకు వచ్చింది. రష్యన్ యువతులతో గడిపిన తర్వాత బిల్‌గేట్స్‌కు సెక్సువల్ డిసీజ్ సోకిందని ఎప్‌స్టీన్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎప్‌స్టీన్ రాసుకున్న ఈమెయిల్ ద్వారా బయటపడింది.
ఇక ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై గేట్స్ విచారం వ్యక్తం చేశారు. "నేను అతడితో (జెఫ్రీ ఎప్‌స్టీన్) గడిపిన ప్రతి నిమిషానికి ఇప్పుడు చింతిస్తున్నాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఆ మెయిల్‌లో ఉన్నది నిజం కాదు. ఆ మెయిల్ ఎప్పుడూ పంపలేదు. అది అవాస్తవం. అతని ఆలోచన ఏమిటో నాకు తెలియదు. ఏదో ఒకరూపంలో అతను నన్ను టార్గెట్ చేసేందుకు ప్రయత్నించాడా..?" అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇక ఎప్‌స్టీన్ ఫైల్స్ కారణంగానే బిల్‌గేట్స్‌తో వైవాహిక బంధాన్ని ముగించినట్లు ఆయన మాజీ భార్య మెలిందా గేట్స్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Melania Trump | అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
ఏప్రిల్ 10, 2026

Bill Gates apology | ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: రష్యన్ మహిళలతో ఎఫైర్స్ నిజమే.. సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు!
ఫిబ్రవరి 25, 2026

Youth Congress president | ఏఐ సమ్మిట్‌లో అర్ధనగ్న నిరసన.. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరెస్ట్
ఫిబ్రవరి 24, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



