త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitish Kumar | నేడు రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ ప్రమాణం.. 14న బీహార్‌కు కొత్త సీఎం!

Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఎట్ట‌కేల‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా (Rajya Sabha) ప్ర‌మాణ స్వీకారం (Oath) చేయ‌నున్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు ఉప రాష్ట్రప‌తి రాధాకృష్ణ‌న్ ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయిస్తారు.

G

National | Published On Apr 10, 2026, 7.29 am IST

Nitish Kumar | నేడు రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ ప్రమాణం.. 14న బీహార్‌కు కొత్త సీఎం!
Advertisement

Nitish Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఎట్ట‌కేల‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా (Rajya Sabha) ప్ర‌మాణ స్వీకారం (Oath) చేయ‌నున్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు ఉప రాష్ట్రప‌తి రాధాకృష్ణ‌న్ ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయిస్తారు. దీంతో బీహార్ (Bihar) రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగియ‌నుంది. ఎన్నో ఏండ్లు సీఎంగా సేవలందించిన నితీష్ కుమార్, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొత్త బాధ్యతలు చేప‌ట్ట‌నున్నారు. ఎన్నో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు, త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల న‌డుమ ఆయ‌న త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దిలేందుకు సిద్ధ‌మ‌య్యారు. మార్చి 16న రాజ్యసభకు ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఆయ‌న‌.. మార్చి 30న బీహార్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌మాణం చేయ‌నుండ‌టంతో రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై స్ప‌ష్ట‌త రానుంది. అయితే అబేంద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ నెల 14న బీహార్ నూత‌న సీఎంను ఎన్డీయే (NDA) కూట‌మి ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.

కాగా, గురువారం ఢిల్లీకి చేరుకున్న నితీష్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `నేను రేపు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. బీహార్ ముఖ్యమంత్రి పదవిని వదిలేసి ఇక్కడికి వచ్చాను. రాబోయే మూడు నాలుగు రోజుల్లో బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. నేను గతంలోనూ ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నా. మధ్యలో బీహార్‌కు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చా. ఇకపై ఇక్కడే ఉంటాను. ఇన్నేళ్లుగా బీహార్‌లో చాలా పని చేశాను. ఇప్పుడు ఇక్కడ పనిచేస్తా.` అన్నారు. దీంతో ఆయ‌న‌కు కేంద్రంలో కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నుంద‌ని రాజ‌కీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, తన కుమారుడి భ‌విత‌వ్యం గురించి రాష్ట్ర నేత‌లు మాట్లాడుతార‌ని నితీశ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement