త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

2026 Assembly Election Results | ముగ్గురు ముఖ్యమంత్రులకు బిగ్ షాక్: తమిళనాట దళపతి సంచలనం, బెంగాల్‌లో దీదీ వెనుకంజ.. కేరళలో మళ్లీ ఓల్డ్ ట్రెడిషన్

2026 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశ రాజకీయాలను శాసిస్తున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. అధికార పక్షాలు కంగుతినేలా ఫలితాలు వెలువడుతున్నాయి.

J

National | Published On May 4, 2026, 11.53 am IST

2026 Assembly Election Results | ముగ్గురు ముఖ్యమంత్రులకు బిగ్ షాక్: తమిళనాట దళపతి సంచలనం, బెంగాల్‌లో దీదీ వెనుకంజ.. కేరళలో మళ్లీ ఓల్డ్ ట్రెడిషన్
Advertisement

2026 Assembly Election Results | త్రినేత్ర.న్యూస్ : 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ ప్రకారం తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల అధికార పక్షాలకు ప్రజలు బిగ్ షాకిచ్చారు. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల సీఎంలు, వాళ్ల పార్టీలు ఎం.కె.స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయి విజయన్ వెనుకంజలో ఉండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

తమిళనాడులో దళపతి సంచలనం

అధికార డీఎంకే (DMK)కు తమిళనాట గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ దాదాపు 110 స్థానాల్లో ముందంజలో ఉండి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కొళత్తూరులో ముందంజలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా కూటమి వెనుకంజలో కొనసాగుతోంది. ఫలితాల దెబ్బకు డీఎంకే శ్రేణుల్లో తీవ్ర నిరాశ అలుముకుంది. సంబరాల కోసం వేసిన టెంట్లను సైతం కార్యకర్తలు పీకేస్తున్న దృశ్యాలు తాజా రాజకీయ ముఖచిత్రానికి అద్దం పడుతున్నాయి.

బెంగాల్‌లో దీదీకి బీజేపీ చెక్

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత గట్టి పోటీ ఎదురవుతోంది. తాజా గణాంకాల ప్రకారం బీజేపీ (BJP) సత్తా చాటుతూ 192 స్థానాల్లో ముందంజలో ఉండగా, అధికార టీఎంసీ కేవలం 98 స్థానాలకే పరిమితమైంది. దీనికి తోడు స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో వెనుకంజలో ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కేరళలో మళ్లీ పాత సంప్రదాయమే

ఇక కేరళలో కూడా అధికార ఎల్‌డీఎఫ్ (LDF) కు ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ (UDF) కూటమి ఏకంగా 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదేళ్లకోసారి అధికారం మారే కేరళ సంప్రదాయం మళ్ళీ పునరావృతమయ్యేలా తాజా ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.

Advertisement
Advertisement