Bharat Taxi | భారత్ ట్యాక్సీ సేవలు షురూ.. ప్రత్యేకతలు ఇవే..!
Bharat Taxi | దేశంలో కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ప్రారంభమైన తొలి సహకార రైడ్-హైలింగ్ యాప్ భారత్ ట్యాక్సీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. భారత్ ట్యాక్సీ యాప్‌ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ప్రారంభించగా, దీన్ని సహకార ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
Bharat Taxi | దేశంలో కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ప్రారంభమైన తొలి సహకార రైడ్-హైలింగ్ యాప్ భారత్ ట్యాక్సీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. భారత్ ట్యాక్సీ యాప్‌ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ప్రారంభించగా, దీన్ని సహకార ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 5, 2026న కేంద్ర మంత్రి అమిత్ షా ఈ సేవలను జాతీయ స్థాయిలో ప్రారంభించారు. దీనికి ముందు ఢిల్లీ-ఎన్‌సీఆర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా భారత్ ట్యాక్సీసేవలను పరీక్షించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ట్యాక్సీ సేవలు ప్రారంభం అయ్యాయి. భారత్ ట్యాక్సీ వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్ అని చెప్పవచ్చు. ప్రైవేట్ కంపెనీలు మధ్యవర్తులుగా ఉండి ప్రతి ప్రయాణంపై కమిషన్ తీసుకునే విధానం కాకుండా, ఈ యాప్‌ను నడిపేది డ్రైవర్లే కావడం విశేషం. అంటే డ్రైవర్లు కేవలం పని చేసే వారు కాదు, ఈ వ్యవస్థలో భాగస్వాములుగా కూడా ఉంటారన్నమాట.
సున్నా కమిషన్ విధానం..
ఈ యాప్ ద్వారా కార్లు, ఆటోలు, బైక్ ట్యాక్సీలను ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. ఇక డ్రైవర్లకు మాత్రం భారీ కమిషన్లు ఇందులో ఉండవు. ఈ క్రమంలో మధ్యవర్తిని తొలగించడం ద్వారా ప్రయాణికులకు, డ్రైవర్లకు మేలు చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. భారత్ ట్యాక్సీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం, సున్నా కమిషన్ విధానం. అంటే డ్రైవర్ సంపాదించిన మొత్తాన్ని డ్రైవర్‌కే ఇస్తారు. ఎలాంటి కమిషన్‌ను కూడా యాప్ తీసుకోదు. ఇది డ్రైవర్లకు చాలా మేలు చేస్తుంది. ప్రస్తుతం ఇతర క్యాబ్ సర్వీసుల్లో సేవలను అందిస్తున్న డ్రైవర్లు భారీ కమిషన్లు ఉన్నాయని పెద్ద ఎత్తున ఇప్పటికే అనేక సార్లు ఫిర్యాదు చేశారు. అందువల్ల డ్రైవర్లందరికీ భారత్ ట్యాక్సీ ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.
సర్జ్ ప్రైసింగ్ లేదు..
ఇక ఇతర క్యాబ్ సర్వీసుల్లో పీక్ సమయాలు లేదా ఇతర ముఖ్యమైన సందర్భాల్లో సర్జ్ ప్రైసింగ్ ఉంటుంది. అంటే, క్యాబ్ చార్జిల వివరాలను నిర్దిష్టమైన మొత్తం కన్నా భారీగా పెంచి వసూలు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కూడా పెంచిన మొత్తం డ్రైవర్లకు చెందడం లేదని చాలా మంది డ్రైవర్లు వాపోతున్నారు. అయితే భారత్ ట్యాక్సీలో ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టారు. ఎలాంటి సర్జ్ ప్రైసింగ్ లేదు. ప్రయాణికులు అన్ని వేళలా ఒకేలాంటి చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి పెంపు ఉండదు. రద్దీ సమయంలో లేదా వర్షం పడినప్పుడు, ఇతర సమయాల్లో క్యాబ్ చార్జిలను పెంచడం ఉండదు. బుకింగ్ సమయంలో చూపించిన చార్జిలనే చెల్లిస్తే సరిపోతుంది. అలాగే హిడెన్ చార్జిలు కూడా లేవని స్పష్టం చేశారు.
డ్రైవర్‌కు బీమా సదుపాయం..
ప్రైవేట్ రైడ్ యాప్‌లు సాధారణంగా ప్రతి ప్రయాణంపై ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కమిషన్ వసూలు చేస్తాయి. భారత్ ట్యాక్సీ ఈ మొత్తాన్ని పూర్తిగా తొలగించింది. అంతేకాదు, డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా, కుటుంబానికి ఆరోగ్య రక్షణ వంటి సదుపాయాలు కూడా అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక భారత్ ట్యాక్సీ డ్రైవర్‌గా చేరడం పెద్ద కష్టమేమీ కాదు. డ్రైవర్లు ముందుగా భారత్ ట్యాక్సీ డ్రైవర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ వంటి ప్రాథమిక పత్రాలను అప్‌లోడ్ చేయాలి. డిజిటల్ లాకర్ ద్వారా ధ్‌రువీకరణ, పోలీస్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డ్రైవర్ రైడ్స్‌ను ప్రారంభించవచ్చు.
భద్రతకు ప్రాధాన్యత..
భద్రతకు ఈ యాప్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యక్ష ట్రాకింగ్, అత్యవసర సహాయ బటన్, పోలీసులతో నేరుగా అనుసంధానం వంటి సదుపాయాలు ఉన్నాయి. అలాగే బైక్ దీది కార్యక్రమం ద్వారా సాధ్యమైన చోట మహిళా ప్రయాణికులకు మహిళా డ్రైవర్లను కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. యాప్‌లో ఉన్న డ్రైవర్లందరూ పోలీస్ ధ్రువీకరణ పొందినవారే కావడం విశేషం. ఇక ప్రయాణికుల అనుభవం ఇప్పటివరకు ఉన్న యాప్‌ల మాదిరిగానే ఉంటుంది. యాప్ డౌన్‌లోడ్ చేసి ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకుని, పికప్ - డ్రాప్ ప్రాంతాలు నమోదు చేసి, కార్ లేదా ఆటో లేదా బైక్ ఎంచుకుని, ధర చూసి ప్రయాణాన్ని నిర్ధారించుకోవచ్చు. ప్రస్తుతం భారత్ ట్యాక్సీ రోజుకు పది వేలకుపైగా ప్రయాణాలు నమోదు చేస్తోంది. 3 లక్షలకు పైగా డ్రైవర్లు ఇప్పటికే నమోదు అయ్యారు. ఇది ముఖ్యంగా డ్రైవర్లకు చక్కని ఆదాయం ఆశించే వారికి ఆకర్షణీయంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ట్యాక్సీ సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BJP | రాహుల్ రిమోట్ కంట్రోల్ పాకిస్థాన్‌లో ఉంది : బీజేపీ
మే 20, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

Amit Shah Felicitates Telangana Police | తెలంగాణ పోలీసులకు అరుదైన గౌరవం: ‘నక్సల్స్ ఫ్రీ’ ఆపరేషన్‌పై అమిత్ షా ప్రశంసల జల్లు
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



