Amit Shah Felicitates Telangana Police | తెలంగాణ పోలీసులకు అరుదైన గౌరవం: ‘నక్సల్స్ ఫ్రీ’ ఆపరేషన్‌పై అమిత్ షా ప్రశంసల జల్లు
తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన డీజీపీ సీవీ ఆనంద్ తదితర పోలీసు ఉన్నతాధికారులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సత్కరించి, వారి సేవలను ప్రశంసించారు.
Amit Shah Felicitates Telangana Police | త్రినేత్ర.న్యూస్ : నక్సలిజం (Naxalism) రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా 'నక్సల్స్ రహితంగా' (Naxal-free) తీర్చిదిద్దిన మన రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) జగదల్‌పూర్‌లో సోమవారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah).. మావోయిస్టుల ఏరివేతలో కీరోల్ ప్లే చేసిన తెలంగాణ పోలీసు అధికారులను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్
వామపక్ష తీవ్రవాదాన్ని (Left Wing Extremism) సమూలంగా అణచివేసిన రాష్ట్రంగా తెలంగాణను ఈ సభలో అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు (మాజీ డీజీపీ) బి. శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్ & గ్రేహౌండ్స్) అనిల్ కుమార్, మల్కాజ్‌గిరి సీపీ & మాజీ SIB ఐజీపీ సుమతితో పాటు ఆమె నేతృత్వంలోని ఎస్‌ఐబీ (SIB) బృందాన్ని హోం మంత్రి స్వయంగా సత్కరించి, వారి విశేష సేవలను కొనియాడారు.
2026 నాటికి నక్సలిజం ఎండ్
ఈ సందర్భంగా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం పక్కా డెడ్‌లైన్ ఫిక్స్ చేసుకుందని వెల్లడించారు. "మేం ఈ లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఇది సాధ్యం కాదని చాలామంది సందేహించారు. కానీ స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్లాం. మా దంతేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు బస్తర్ (Bastar) ప్రాంతాన్ని నక్సల్స్ రహితంగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఛత్తీస్‌గఢ్ ఇప్పుడు ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందింది. ఇదొక చరిత్రాత్మక విజయం" అని ఆయన అన్నారు.
మూడు తరాల పీడకల.. జవాన్ల బలిదానం
1970వ దశకం నుంచి దేశ ప్రజలకు నక్సలిజం ఒక పీడకలగా మారిందని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతో రక్తపాతం జరిగిందని, అభివృద్ధి ఆగిపోయి యువత భవిష్యత్తు అంధకారమైందని గుర్తు చేశారు. నక్సలిజం అనేది కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని.. అది ఒకప్పుడు దేశమంతా వ్యాపించిందన్నారు. ఒక జీవిత కాలంలో సాధించలేమనుకున్న ఈ లక్ష్యాన్ని.. ఎంతోమంది జవాన్ల బలిదానాలు, భద్రతా దళాల (Security forces) అద్భుతమైన సమన్వయం, పట్టుదల వల్లే ఈరోజు సాకారం చేసుకోగలుగుతున్నామని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






