త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharat Taxi | భార‌త్ ట్యాక్సీతో డ్రైవ‌ర్ల‌కు రూ.35కోట్ల ఆదాయం : కేంద్రం

Bharat Taxi | కేంద్ర ప్రభుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చ‌ని కో ఆప‌రేటివ్ రైడ్-హెలింగ్ ప్లాట్‌ఫామ్ భారత్ ట్యాక్సీ విజయవంతంగా పని చేస్తున్నదని బుధవారం ప్రకటించింది. సుమారు రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ యాప్ స‌ర్వీస్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు డ్రైవ‌ర్ల‌కు రూ.35కోట్ల వ‌ర‌కు ఆదాయాన్ని సంపాదించి పెట్టింద‌ని వెల్ల‌డించింది.

P

National | Published On Mar 18, 2026, 8.15 pm IST

Bharat Taxi | భార‌త్ ట్యాక్సీతో డ్రైవ‌ర్ల‌కు రూ.35కోట్ల ఆదాయం : కేంద్రం
Advertisement

Bharat Taxi | కేంద్ర ప్రభుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చ‌ని కో ఆప‌రేటివ్ రైడ్-హెలింగ్ ప్లాట్‌ఫామ్ భారత్ ట్యాక్సీ విజయవంతంగా పని చేస్తున్నదని బుధవారం ప్రకటించింది. సుమారు రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ యాప్ స‌ర్వీస్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు డ్రైవ‌ర్ల‌కు రూ.35కోట్ల వ‌ర‌కు ఆదాయాన్ని సంపాదించి పెట్టింద‌ని వెల్ల‌డించింది. దాదాపుగా 20వేల మంది డ్రైవ‌ర్లు, 200 స‌హాయ‌క సిబ్బందికి ఉపాధి అవ‌కాశాలు దొరికాయ‌ని పేర్కొంది. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లిఖితపూర్వకంగా ఇచ్చిన స‌మాధానంలో.. భారత్ ట్యాక్సీ డ్రైవర్ల సాధికారతకు, రవాణా రంగంలో సమీకృత అభివృద్ధిలో ముంద‌డుగుగా పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో డ్రైవర్లను సారథులుగా పిలుస్తార‌ని, యజమానులుగా, నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉంటారని స్పష్టం చేశారు. భారత్ ట్యాక్సీ ప్రస్తుత యాప్ ఆధారిత క్యాబ్ సేవల మాదిరిగా కాకుండా, కో ఆప‌రేటివ్ మోడల్‌లో పనిచేస్తుంది.

డ్రైవర్ల నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోకుండా, ప్రతి రైడ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా డ్రైవర్‌కే అందిస్తుంది. కేవ‌లం సబ్‌స్క్రిప్షన్ ఫీజు ద్వారా మాత్రమే కొంత మొత్తాన్ని తీసుకోనున్నారు. ప్రయాణికులు సైతం కేవలం ట్రిప్ ఛార్జ్ మాత్రమే చెల్లిస్తే స‌రిపోతుంది. ఎలాంటి కన్వీనియన్స్ ఫీజులు, సర్జ్ ప్రైసింగ్ ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. 'సహకారం ద్వారా సమృద్ధి' అనే లక్ష్యంతో 2025 జూన్ 6న మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద భారత్ ట్యాక్సీని తీసుకురాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న సేవలను అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సోమనాథ్, ద్వారక వంటి నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. దశలవారీగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లకు స్థిరమైన ఆదాయం లభించడమే కాక, ప్రైవేట్ అగ్రిగేటర్ మోడళ్లకు గౌరవప్రదమైన ప్రత్యామ్నాయాన్ని అందించడం లక్ష్యంగా ప‌ని చేస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement