Diwali 2026 | నేడు దీపావళి.. లక్ష్మీపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
Diwali 2026 | చీకట్లను పారదోలి వెలుగులు నింపే దీపావళి పండుగకు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఆశ్వీయుజ మాస అమావాస్య రోజున జరుపుకునే ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తారు. 14 ఏళ్ల వనవాసం అనంతరం సీతారాములు, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని పురాణాలు పేర్కొంటున్నాయి.
Devotional | Published On Nov 8, 2026, 4.05 am IST
Diwali 2026 | చీకట్లను పారదోలి వెలుగులు నింపే దీపావళి పండుగకు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఆశ్వీయుజ మాస అమావాస్య రోజున జరుపుకునే ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తారు. 14 ఏళ్ల వనవాసం అనంతరం సీతారాములు, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి, విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించడం ఆనవాయితీ. దీపావళి రాత్రి లక్ష్మీపూజకు అత్యంత ప్రాధాన్యం ఉండటంతో.. 2026లో పండుగ ఎప్పుడు? పూజకు అనుకూలమైన సమయం ఏది? ఇంట్లో లక్ష్మీపూజ ఎలా చేయాలి? తెలుసుకుందాం..!
నేడు (నవంబర్ 8న)ఆదివారం దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కార్తీక మాస కృష్ణపక్ష అమావాస్య తిథి ఉదయం 11.27 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 9న మధ్యాహ్నం 12.31 గంటలకు ముగుస్తుంది. అమావాస్య తిథి నవంబర్ 9న ఉదయానికి ఉన్నప్పటికీ.. నవంబర్ 8న ప్రదోషకాలంలో అమావాస్య తిథి ఉండడంతో అదే రోజు దీపావళి నిర్వహించడం సంప్రదాయంగా పేర్కొంటున్నారు. శాస్త్రోక్తంగా దీపావళి రోజున ప్రదోషకాలంలో, స్థిర లగ్నంలో లక్ష్మీదేవిని పూజించడం విశేష ఫలప్రదమని భావిస్తారు. 2026 నవంబర్ 8న లక్ష్మీపూజకు ప్రధాన శుభ ముహూర్తం సాయంత్రం 5.54 నుంచి రాత్రి 7.50 గంటల వరకు ఉంది.
ముఖ్యమైన సమయాలు ఇవే..
అమావాస్య తిథి ప్రారంభం : నవంబర్ 8 ఉదయం 11.27 గంటలకు
అమావాస్య తిథి ముగింపు : నవంబర్ 9 మధ్యాహ్నం 12.31 గంటలకు
ప్రదోషకాలం : సాయంత్రం 5.31 నుంచి రాత్రి 8.09 గంటల వరకు
వృషభ లగ్నం : సాయంత్రం 5.54 నుంచి రాత్రి 7.50 గంటల వరకు
లక్ష్మీపూజ ముహూర్తం : సాయంత్రం 5.54 నుంచి రాత్రి 7.50 గంటల వరకు
నిశీథ కాలం : రాత్రి 11.39 నుంచి అర్ధరాత్రి 12.31 గంటల వరకు
సింహ లగ్నం : నవంబర్ 9 తెల్లవారుజామున 12.25 నుంచి 2.42 గంటల వరకు
లక్ష్మీపూజకు కావాల్సిన పూజా సామగ్రి
దీపావళి లక్ష్మీపూజ కోసం కొన్ని పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. ముందస్తుగా సిద్ధం చేసుకోవడం వల్ల నిరాటంకంగా కొనసాగించొచ్చు.
- చెక్క పీట, ఎరుపు లేదంటే పసుపు రంగు వస్త్రం
- లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు లేదా చిత్రపటాలు
- కుంకుమ, గంధం, పసుపు, అక్షింతలు, తమలపాకులు, వక్కలు
- కొబ్బరికాయ, పూలు, పండ్లు, పంచామృతం, గంగాజలం
- ధూపం, అగరబత్తులు, కర్పూరం
- నెయ్యి, నూనె, మట్టి ప్రమిదలు, వత్తులు
- కలశం, నీరు, మామిడి ఆకులు, కలవ, దుర్వా గడ్డి
- నాణేలు, ధాన్యాలు, గోమతి చక్రం, పసుపు గవ్వలు, కమల గింజలు
పూజా మందిరాన్ని ఇలా సిద్ధం చేసుకోండి
ముందుగా ఇంటిని, పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఈశాన్య దిశలో చెక్క పీటను ఏర్పాటు చేసి దానిపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. వస్త్రంపై బియ్యం పోసి లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించాలి. పీట పక్కన రాగి లేదంటే ఇత్తడి కలశాన్ని ఏర్పాటు చేయాలి. అందులో శుద్ధమైన నీటితో పాటు గంగాజలం, నాణెం, వక్క, అక్షతలు వేయాలి. కలశం పైభాగంలో మామిడి ఆకులు ఉంచి, పూజా సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయను ఏర్పాటు చేయాలి.
తొలిపూజ వినాయకుడికి.. ఆ తర్వాతే లక్ష్మీదేవి..
పూజ ప్రారంభించే ముందు ఆచమనం చేసి, పూజా సామగ్రిపై పవిత్ర జలాన్ని చల్లుకోవాలి. అనంతరం అక్షింతలు, పండ్లు, నీటిని చేతిలో ఉంచుకుని కుటుంబానికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని సంకల్పం చెప్పుకోవాలి. తొలుత వినాయకుడికి కుంకుమ, అక్షింతలు, దుర్వా గడ్డి, పూలు, నైవేద్యం సమర్పించి పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి ఆరాధన ప్రారంభించాలి. లక్ష్మీదేవికి కుంకుమ, ఎర్రటి పూలు, కమలాలు, పేలాలు, పటికబెల్లం, మిఠాయిలు, పండ్లు సమర్పించాలి. అనంతరం అమ్మవారి పాదాల చెంత నాణేలు, పసుపు గవ్వలు, గోమతి చక్రం, కమల గింజలు ఉంచి పూజించాలి. వీటిని పూజ అనంతరం భద్రపరచుకోవడం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది. అనంతరం ధనానికి అధిపతిగా భావించే కుబేరుడిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుటుంబంలో ధనధాన్యాలు, సుఖసంతోషాలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థించాలి.
దీపాలు వెలిగించి మంత్ర పఠించాలి..
లక్ష్మీపూజ సమయంలో ఆవు నెయ్యితో నాలుగు వత్తుల దీపాన్ని, ఆవాల నూనెతో మరో దీపాన్ని వెలిగించడం సంప్రదాయం. అనంతరం అమ్మవారిని ధ్యానిస్తూ మంత్రాలను జపించాలి. ‘ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద.. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః’ అనే మంత్రాలను జపించాలి. అలాగే, ‘ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహా’ అనే కుబేర మంత్రాన్ని కూడా పఠించాలి. ఇక పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ముందుగా వినాయకుడికి, ఆపై లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. పూజలో తెలిసో తెలియకో జరిగిన పొరపాట్లను క్షమించాలని ప్రార్థించాలి. అనంతరం ఇంటి గుమ్మం, తులసి కోట, పూజా మందిరం, ఇంటి పరిసరాల్లో దీపాలు వెలిగించాలి. దీపాల వెలుగులతో ఇల్లంతా ప్రకాశింపజేసి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Flight Fares | దీపావళి ఎఫెక్ట్.. విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్-లక్నోకు రూ.18వేలు..!
నవంబర్ 7, 2026

HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు
నవంబర్ 7, 2026

Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామనగిరి..!
నవంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Flight Fares | దీపావళి ఎఫెక్ట్.. విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్-లక్నోకు రూ.18వేలు..!
- ●HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు
- ●Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామనగిరి..!
- ●Diwali 2026 | ఇంట్లో లక్ష్మీగణేశుల పూజ ఎలా చేయాలి? పూర్తి విధానం, మంత్రాలు ఇవే!
- ●CM Revanth Reddy | కొడంగల్లో పారిశ్రామిక హబ్.. 535 మందికి ఉద్యోగాలు
- ●PJTAU | బీఎస్సీ అగ్రికల్చర్లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈనెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు..

Flight Fares | దీపావళి ఎఫెక్ట్.. విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్-లక్నోకు రూ.18వేలు..!

HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు

Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామనగిరి..!

Diwali 2026 | ఇంట్లో లక్ష్మీగణేశుల పూజ ఎలా చేయాలి? పూర్తి విధానం, మంత్రాలు ఇవే!



