Diwali 2026 | దీపావళి లక్ష్మీపూజ ముహూర్తాలు ఇవే.. ఎవరెప్పుడు పూజ చేయాలంటే?
Diwali 2026 | దీపావళి పండుగకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ 8, ఆదివారం దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు. కార్తీక మాసం అమావాస్య, ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. దీపావళి రోజున లక్ష్మీదేవితోపాటు గణేశుడు, కుబేరుడిని ఆరాధించడం ఆనవాయితీ.
Devotional | Published On Nov 8, 2026, 5.00 am IST
Diwali 2026 | దీపావళి పండుగకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ 8, ఆదివారం దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు. కార్తీక మాసం అమావాస్య, ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. దీపావళి రోజున లక్ష్మీదేవితోపాటు గణేశుడు, కుబేరుడిని ఆరాధించడం ఆనవాయితీ. ఈ పండుగ ధన త్రయోదశితో ప్రారంభమై భగినీ హస్త భోజనం (భాయ్ దూజ్) వరకు ఐదు రోజులపాటు కొనసాగుతుంది. పురాణాల ప్రకారం.. కార్తీక అమావాస్య రాత్రి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇళ్లను సందర్శిస్తుందని, పరిశుభ్రత, వెలుగులు ఉన్న చోట కొలువై ఉంటుందని నమ్మకం. అందుకే దీపావళి రోజున ఇళ్లను శుభ్రం చేసి దీపాలతో అలంకరిస్తారు. సూర్యాస్తమయం తర్వాత వచ్చే మూడు ముహూర్తాల సమయమైన ప్రదోష కాలంలో లక్ష్మీపూజ చేయడం శ్రేష్ఠంగా భావిస్తారు. ప్రదోష కాలంతోపాటు స్థిర లగ్నమైన వృషభ లగ్నంలో పూజించడం కూడా విశేషమని పండితులు చెబుతున్నారు. మహానిశీత కాలంలో చేసే పూజలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో కాళీమాత ఆరాధనను తాంత్రికులు, సాధకులు నిర్వహిస్తారు.
దీపావళి లక్ష్మీపూజ ముహూర్తాలు ఇవే..
నవంబర్ 8న ఇళ్లతోపాటు దుకాణాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో లక్ష్మీపూజ నిర్వహించేందుకు వివిధ శుభ ముహూర్తాలు సూచించారు పండితులు..
గృహస్థులకు: సాయంత్రం 5.49 నుంచి రాత్రి 8.59 గంటల వరకు.
ఉద్యోగులకు: ఉదయం 11.46 నుంచి మధ్యాహ్నం 12.34 గంటల వరకు (అభిజిత్ ముహూర్తం).
దుకాణాలు, కొత్త వ్యాపార సంస్థలకు: ఉదయం 8.10 నుంచి 9.40 గంటల వరకు (చంచల).
వ్యాపారులు, రైతులకు: ఉదయం 9.40 నుంచి 11.10 గంటల వరకు (లాభ).
ప్రైవేట్ కార్యాలయాలకు: ఉదయం 11.28 నుంచి మధ్యాహ్నం 12.13 గంటల వరకు (అమృత).
విద్యార్థులకు: మధ్యాహ్నం 1.35 నుంచి 2.58 గంటల వరకు (శుభ).
సాధకులు, ఉపాసకులకు: సాయంత్రం 5.41 నుంచి రాత్రి 8.17 గంటల వరకు (ప్రదోష కాలం).
లగ్నం ప్రకారం లక్ష్మీపూజ సమయాలు..
దేశీయ వ్యాపారులకు: సాయంత్రం 6.09 నుంచి రాత్రి 8.07 గంటల వరకు (వృషభ లగ్నం).
విదేశాల్లో నివసించేవారు, విదేశీ వ్యాపారాలు చేసేవారికి: మధ్యాహ్నం 12.37 నుంచి 2.49 గంటల వరకు (సింహ లగ్నం).
లక్ష్మీపూజ ఎలా చేయాలి?
పూజా స్థలం సిద్ధం చేసుకోవాలి: ముందుగా ఇంట్లో పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. పూజా పీఠంపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిపై అక్షింతలు వేయాలి.
లక్ష్మీగణేశుల ప్రతిష్ఠ: పూజా పీఠంపై లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. పూజ చేసేవారు ఉత్తరం వైపు ముఖం పెట్టుకుని కూర్చోవాలి. దీపావళి పూజకు ఉత్తర దిశను శుభప్రదంగా భావిస్తారు.
పూజా సామగ్రి: నీటితో నింపిన కలశం, పేలాలు, బతాషాలు, కుంకుమ, గంగాజలం, అక్షింతలు, రోలి, మౌళి, పండ్లు, స్వీట్లు, తమలపాకులు, వక్కలు, యాలకులు తదితరాలను సిద్ధం చేసుకోవాలి.
దీపారాధన: పూజా స్థలంలోని ఆగ్నేయ భాగంలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ప్రధాన దీపాన్ని రాత్రంతా వెలిగించి ఉంచే సంప్రదాయం కూడా ఉంది.
నైవేద్యం.. హారతి: లక్ష్మీదేవి, గణేశుడికి ఖీర్, బూందీ లడ్డూలు, డ్రైఫ్రూట్స్, మినప లేదా ఖోవాతో చేసిన స్వీట్లు సమర్పించాలి. అనంతరం లక్ష్మీదేవి మంత్రాలను జపించి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. ఇలా సంప్రదాయబద్ధంగా లక్ష్మీగణేశులను పూజించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Diwali 2026 | నేడు దీపావళి.. లక్ష్మీపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
- ●Flight Fares | దీపావళి ఎఫెక్ట్.. విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్-లక్నోకు రూ.18వేలు..!
- ●HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు
- ●Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామనగిరి..!
- ●Diwali 2026 | ఇంట్లో లక్ష్మీగణేశుల పూజ ఎలా చేయాలి? పూర్తి విధానం, మంత్రాలు ఇవే!
- ●CM Revanth Reddy | కొడంగల్లో పారిశ్రామిక హబ్.. 535 మందికి ఉద్యోగాలు

Diwali 2026 | నేడు దీపావళి.. లక్ష్మీపూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?

Flight Fares | దీపావళి ఎఫెక్ట్.. విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్-లక్నోకు రూ.18వేలు..!

HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు

Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామనగిరి..!



